అనగనగా ఒక ఊరిలో రెండు పిల్లులు వుండేవి..అవి ఎప్పుడూ చాలా సంతోషంగా ఊరంతా తిరుగుతూ..చక్కగా దొరికిన ఆహారాన్ని రెండూ సమానంగా పంచుకొని తింటూ వుండేవి..అయితే ఒకరోజు ఏమైందో తెలియదు కానీ ఆ రెండు పిల్లులకు భోజనం దొరకలేదు..ఎక్కడ..ఎంతసేపు వెతికినా వాటికి మాత్రం ఆహారం దొరకలేదు .దాంతో అవి పూర్తిగా నీరసించిపోయాయి.. కానీ అనుకోకుండా దూరంగా వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది.. అసలే ఆహారం లేక రెండు నీరసించి పోయాయి. అందుకే ప్రతి ఒక్క దొరకగానే తినేయాలని అనుకున్నాయి..


కానీ  ఒకే ఒక్క రొట్టె ముక్క కావడం తో దాని కోసం రెండూ  దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. రొట్టె ముక్క నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను అక్కడే చెట్టు మీద వున్న ఒక కోతి చూసింది. చాలా సేపు వాటి గొడవను చూస్తూనే ఉంది..ఎంతసేపటికీ వాటి గొడవ మాత్రం  తీరట్లేదు.. ఈ సమస్యకు పరిష్కారం కూడా  వాటికి తోచలేదు .

మొత్తానికి కోతి  దిగివచ్చి.వాటిని విడదీసి ఇంతటి దానికి ఎందుకు? దెబ్బలడుతున్నారు. మీ సమస్యకు ఒక్కటే పరిష్కారం వుంది..  ఈ రొట్టె ముక్కని మీరు చెరి సగం పంచుకోండి అంతే..కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా ఈ రొట్టె ముక్కను నేను పంచి పెడతాను అని చెప్పింది ఆ కోతి..ఇక ఆ కోతి మాట ఆ పిల్లులకు నచ్చడం తో సరే అని చెప్పి ఆ రొట్టే ముక్క ను కోతికి అందజేశాయి.

కోతి ఆ ముక్కను రెండుగా చేయడం మొదలు పెట్టింది. "అయ్యో !ఒక్క ముక్క పెద్దగా ఉందే!"అని కోతి ఆ ముక్కను తన ఆకలినితీర్చుకోవడానికి కొంచెం కొరికి తినేసింది.."అరెరే! ఇప్పుడు ఇంకో ముక్క పెద్దగా అయిపోయింది!" అని రెండవ ముక్కలో కూడా కొంచెం తినేసింది."ఛ! ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది..అని మొదటి ముక్కలో మళ్ళీ కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి.. మొత్తం రొట్టె ముక్కను ఆ  కోతి తినేసింది. వెంటనే కోతి తుర్రున చెట్టెక్కి అక్కడి నుంచి పారిపోయింది.

పిల్లులు రెండు అలా నోరు తెరుచుకుని చూస్తూ ఉండి పోయాయి. పాపం పిల్లలు రెండూ  నిరాశగా ఏం చేయాలో తెలియక వాటి దారిన అవి వెళ్లిపోయాయి. అందుకే పెద్దలు ఎప్పుడు మనకి ఒకటే చెబుతూ ఉంటారు. ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు లాభం ఎప్పుడు మూడో వాడికి చెందుతుంది అనీ.

మరింత సమాచారం తెలుసుకోండి: