అదో అందమైన అడవి..అందులో  ఎన్నో రకాల పువ్వులు.. మరెన్నో పండ్ల చెట్లు ఉన్నాయి. ఆ అడవికి దూరంగా ఒక గ్రామం  కూడా ఉంది. ఆ గ్రామంలో రంగడు అనే కట్టెల వ్యాపారి ఉండేవాడు. ఓ రోజు ఆ అడవిలోకి వచ్చాడు. అడవిని చూసిన రంగడు..ఇక్కడ ఎన్ని చెట్లున్నాయో! వీటిని నరికేసి అమ్ముకుంటే డబ్బే డబ్బు! అనుకున్నాడు..అడవంతా తిరిగి చెట్ల న్నింటిని చూశాడు. కాసేపటికి అలసటగా అనిపించింది రంగడికి.. ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాడు.
   
కళ్ళముందు ఇన్ని చెట్లున్న ఏం ప్రయోజనం?... చేతిలో పిడిలేని గొడ్డలిని చూసుకుంటూ బాధపడ్డాడు రంగడు.. అతని ముఖంలో నిరాశను చూసిన చెట్టు దిగులుగా ఉన్నావు ఏమయ్యింది?... అంది.ఎవరు... ఎవరు మాట్లాడుతున్నది..అంటూ కంగారు పడ్డాడు రంగడు.. నేనే... నీకు నీడగా నిల్చున్న చెట్టుని.. చెప్పు..నీకేం కష్టం వచ్చింది అని అడిగింది చెట్టు.. నువ్వు సహాయం చేస్తానంటే చెప్తా అన్నాడు. రంగడు తప్పకుండా చేస్తా అంది చెట్టు ..ఈ అడవిలో చాలా చెట్లున్నాయి. వీటిని నరికి పక్క ఊర్లో అమ్ముకుందాం అనుకున్నాను..కానీ నా గొడ్డలి పిడి ఇంటి దగ్గర మరిచిపోయి వచ్చాను.ఇప్పుడు చెట్లను ఎలా నరకగలను అన్నాడు.


అప్పుడు ఆ చెట్టు ఓస్ ఇంతేనా..!! నా కొమ్మల్లో నుంచి ఒక కొమ్మని ఇస్తాను. అంది చెట్టు.. ఆ మాట వినగానే చుట్టూ ఉన్న మిగతా చెట్లన్ని కంగారుగా చూశాయి. అవి ఎందుకు అలా చూస్తున్నాయో పట్టించుకోకుండా ఓ కొమ్మని విరిచి రంగడికి ఇచ్చిందా చెట్టు . రంగడు ఆ కర్ర తీసుకొని గొడ్డలికి అమర్చాడు.. తనకు సహాయపడిన చెట్టునే నరకడం మొదలుపెట్టాడు. రంగడు అలా చేస్తాడని ఊహించని ఆ చెట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 'ఏం చేస్తున్నావ్... నీకు సహాయపడ్డ నన్నే నరుకుతున్నావా ఇది న్యాయమా.... అంటూ అరవసాగింది. చెట్టు .. ఆ మాటల్ని రంగడు పట్టించుకోకుండా తన పని పూర్తి చేశాడు. కాసేపట్లో ఆ చెట్టు నేలకొరిగింది.. ఇదంతా గమనిస్తున్న మిగతా చెట్లన్ని కొన ఊపిరితో ఉన్న ఆ చెట్టుతో... అడవి లోకి వచ్చినవాడు చెడ్డవాడని తెలిసి నువ్వు సహాయం చేశావు.

ఇప్పుడు చూడు ఏమయ్యిందో నీతోపాటు మా అందరి ప్రాణాలకు ముప్పు వచ్చింది అన్నాయి.తెలిసి తెలిసి చెడ్డవాడికి సహాయపడి నందుకు బాధపడింది చెట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: