విక్రమసేనుడు కాశీని పాలించేవాడు. ఓ రోజు సభలో మంత్రులతో.. పండితులతో.. ఆయన కొలువుతీరి ఉన్నాడు. ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకొని చేస్తే ఆ పనులు నెరవేరుతాయి. అలా కాక అదుపుతప్పి చేస్తే వ్యర్ధమవుతాయి. అన్న భావనతో ఓ పండితుడు పద్యం రాశాడు. రాజు అతడి పాండిత్యానికి మెచ్చుకుంటూనే.... ఏ పని అయినా ఫలానా సమయానికి చేయాలని తెలుసుకోవడం ఎలా? అని సందేహంగా అడిగాడు.. గ్రహగతులను బట్టి అని కొందరు , పెద్దల అనుభవాన్ని బట్టి అని మరికొందరు సమాధానమిచ్చారు. ఇంకా చాలా సమాధానాలు వచ్చాయి.. కానీ రాజుకి వాటిలో ఏది సరైనదిగా తోచలేదు. దీనిపై తర్వాత చర్చిద్దాం అని ఆ రోజుకి సభను ముగించాడు.
 

ఓరోజు విక్రమసేనుడు అడవిలో విహరిస్తుండగా అతడికి ఓ సాధువు తన కుటీరం దగ్గర చిన్న చిన్న గోతులు తీస్తూ కనిపించాడు. సాధువునీ సమీపించింది... స్వామీజీ నాదొక సందేహం.. ఏ పని ప్రారంభంకైనా సరైన సమయం ఎలా తెలుస్తుంది? అని అడిగాడు రాజు
సాధువు రాజు వైపు చూసి చిరునవ్వు నవ్వి తన పనిలో మునిగిపోయాడు. సాధువు పనిలో పడడం చూసి మరేమీ ప్రశ్నించకుండా వెళ్లిపోయాడు రాజు మర్నాడు తిరిగి అదే సాధువు దగ్గరికి వెళ్ళాడు విక్రమసేనుడు.. ఆ రాత్రి అక్కడ వర్షం పడింది. సాధువు ఏమో ముందు రోజు తవ్విన గోతుల్లో మొక్కలు నాటుతున్నాడు. రాజు మళ్లీ సాధువును సమీపించి... మహానుభావ తమరు తపస్సుపన్నులు మీరే నా సందేహం తీర్చాలి అని అడిగాడు.
 

సాధువు చిరునవ్వు నవ్వి మీ ప్రశ్నకు జవాబు నిన్నే ఇచ్చాను. అన్నాడు కాస్త వివరంగా చెప్పగలరా అనిఅడిగాడు రాజు.ఇప్పుడు నేను చేస్తున్నది వివరంగా లేదా తొలి పనిలో మునిగిపోయాడు సాధువు కాసేపటికి సాధువు మాటల్లోని అంతరార్థం తెలిసింది రాజుకి అర్థమయ్యింది స్వామీజీ సరైన సమయం వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చునే కంటే చేయాలనుకున్న పని మొదలు పెడితే అన్నీ కలిసోస్తాయి మీరు నిన్న గోతులు తవ్వడం మొదలుపెట్టారు రాత్రి వర్షం పడింది ఈరోజు మొక్కలు నాటారు అన్నాడు రాజు
   
విక్రమసేనుడు అర్థం చేసుకున్నది నిజమేఅన్నట్లు తలవూపాడు సాధువు. ఆయనకు నమస్కరించి ఆనందంగా వెనుదిరిగాడు విక్రమసేనుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: