నేటి మంచిమాట... ఆత్మ విశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం. అవునా? కదా? నేను అయితే అవును అనే చెప్తా.. నాకు తెలిసిన అంత వరుకు ఆత్మ విశ్వాసం లేని వారు బతికి వృధా. ఎందుకంటే? ఆత్మవిశ్వాసం లేని వారు ఏం సాధిస్తారు? ఏ పని చెయ్యాలి అన్న కూడా బయపడి చస్తారు. అలాంటి వారు ఎం సాధిస్తారు? జీవితం వృధా!

 

ఏదైనా బిజినెస్ చెయ్యి పైకి వస్తావు అంటే వినడు.. మరి ఆ బిజినెస్ లో నష్టం వస్తే అని ముందే వెనకడుగు వేస్తాడు.. అలా చేస్తే ఇంకా ఎప్పుడు బాగుపడుతావ్ చెప్పు. మనం ఒక పని చెయ్యాలి అనుకుంటే ముందు మనం ఆత్మ విశ్వాసంతో ఉండాలి.. అప్పుడే మనకు మనపై నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. 

 

అలా కాదు అని.. ప్రతి చిన్న విషయానికి అనవసర ఆలోచనలు చేసి ఆత్మ విశ్వాసం కోల్పోతే ఎప్పుడు గెలవలేరు. అందుకే ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి.. అప్పుడే మనం అనుకున్నది ఏదైనా.. ఎన్ని కష్టాలు వచ్చిన వాటిని ఎదిరించి మనం నిలబడగలం. ఆత్మవిశ్వాసం అంత ధృడమైనది.. ఆత్మవిశ్వాసంతో ఉంటే విజయం మీ కాళ్ళ ముందు ఉంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: