నేటి మంచి మాట.. తృప్తికి మించిన ఐశ్వర్యం.. అత్యాశకు మించిన దరిద్రం మరొకటి ఉండవు! అవును నిజం.. కొందరికి ఎంత సాధించిన సరే.. ఎన్ని కోట్లు ఉన్న సరే తృప్తి ఉండదు.. అత్యాశ చావదు.. అలాంటి వారు ఎప్పటికి ఆనందంగా ఉండలేరు.. అదే కొంతమంది సంపాదించినా కొంత అయినా ఆనందంగా ఉంటారు.. 

 

మీరు గమనించే ఉంటారు.. కొంతమంది ఏమి లేకపోయినా.. చిరునవ్వులు చిందిస్తుంటారు. ఆనందంగా జీవిస్తుంటారు.. ఉన్నది పురే గుడిసెలో అయినా ఆనందంగా జీవిస్తారు. కొందరు... పైన పటారం.. లోన లొటారం అన్నట్టు పెద్ద పెద్ద బిల్డింగ్ ల్లో ఉన్న ఆనందంగా ఉండరు.. ఎప్పుడు ఏదో పోగొన్నూట్టుకున్నట్టే ఉంటారు. 

 

అలాంటి వారు ఎప్పటికి సంతోషంగా జీవించలేరు.. తృప్తికి మించిన ఐశ్వర్యం ఏది ఉండదు అని తెలుసుకోరు.. ఎప్పుడు అత్యాశకు పొయ్యి... అది సాధించలేక బాధలో మునిగిపోయి ఉంటారు.. అలాంటి దరిద్రులు మరొకరు ఉండరు.. అత్యాశాపరులు.. అందుకే మనకు ఎంత ఉంటే అంతలో తృప్తిగా ఉండాలి.. అంతకు మించిన ఐశ్వర్యం మరొకటి ఉండదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: