నేటి మంచిమాట.. జీవితాన్ని మనం ఎంత గొప్పగా చూస్తామో.. అది అంత కంటే గొప్పగా మారుతుంది! అవును.. మనం జీవితాన్ని ఎంత గొప్పగా ఉహించుకుంటామో.. జీవితం కోసం అంతే కష్టం చేస్తే మనం అనుకున్నదాని కంటే గొప్పగా మారుతుంది. అలా కాదు అని జీవితాన్ని గొప్పగా ఉహించుకోకుంటే ఎప్పుడు కూడా జీవితంలో విజయాలు సాధించలేం. 

 

అందుకే మనకంటూ ఒక ఆశయం ఉండాలి.. మనకంటూ కొన్ని ఊహలు ఉండాలి. అప్పుడే జీవితంలో ఏమైనా సాధించగలం. లేదు అంటే జీవితంలో ఏమి సాధించలేం. మనం ఎప్పటికి అలాగే ఉంటాం.. ఇంకా మన జీవితం కూడా సాధారణంగానే ఉంటుంది.. జీవితాన్ని మనం ఎలా చూస్తామో మన జీవితం అలాగే ఉంటుంది. 

 

జీవితం కోసం చిన్నప్పటి నుండే కష్టపడితే మన జీవితం అంతే గొప్పగా ఉండేది. అలా కాదు అని జీవితం కోసం ఆలోచించకుండా.. చెడు స్నేహాలు చేసి.. చెడు అలవాట్లకు బానిసవుతే జీవితం గొప్పగా కాదు.. దరిద్రంగా తయారవుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఒక ఆశయంతో జీవిస్తే జీవితం బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: