నేటి మంచిమాట... జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడే మనం నేర్చుకోగల్గుతాం! అంతేకదా.. అన్ని బాగుంటే.. నీకు ఏది ఇబ్బంది లేకపోతే.. ఎవరు అవమానించకపోతే నువ్వు ఎలా అయితే సుద్దపప్పుల ఉన్నవో అలానే ఉంటావు.. ఇంకా ఎం నేర్చుకుంటావ్? అదే నువ్వు ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తే.. 

 

నీ విజయాన్ని చూసి తట్టుకోలేని వాళ్ళు ఏదో ఒక విధంగా దెబ్బ వెయ్యాలి అనుకుంటారు. ఆ సమయంలో నువ్వు ఏదో ఒక స్టెప్ వల్ల ముందుకు నడవగలవు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన సమయంలోనే మనం ఏమైనా నేర్చుకోగల్గుతాం. ఒకరిపై కసితో అయినా.. వారిపైన గెలవాలి అనే ఉద్ద్యేశంతో అయినా మనం విజయం నేర్చుకోగల్గుతాం. 

 

మనకు ఎదురుదెబ్బలు తగిలిన సమయంలో మనం ఇంకా ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటాం. అందుకే ఎదురుదెబ్బ తగిలిన సమయంలో మనం కుంగి కృశించిపోకుండా ఇంకా ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా ఏదైనా విజయం సాధించగల్గుతాం.. ఏమైనా నేర్చుకోగల్గుతాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: