నేటి మంచిమాట.. కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు. అవును కదా! సలహాలు ఇవ్వడం కంటే చెప్పిన వాటిలో రెండు సలహాలు పాటించిన మంచిదే కదా! పాటించని వారికీ అనవసరంగా సలహాలు ఇచ్చిన అనవసరమే.. అనుచితమే. అలాంటివారికి సలహాలు ఇచ్చి పాటించమని ఫోర్స్ చెయ్యడం కంటే కూడా మనకు తగిన సలహాలు మనం తీసుకుని పాటించడం ఎంతో మంచిది. 

 

IHG

 

అందుకే మహాత్మ గాంధీ కూడా కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు అని చెప్పారు. అందుకే అయన అందరిని చైతన్య పరచడమే కాకుండా అతను కూడా కష్టపడ్డాడు.. పదే పదే జైలుకు వెళ్ళాడు. న్యాయంగా వెళ్ళాడు.. బోధించాడు.. ఆచరణలో పెట్టాడు. అందుకే మనకు స్వతంత్రం వచ్చింది.. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. 

 

IHG

 

అందుకే.. ఒకరి జీవితం బాగుండటానికి మనం కొన్ని సలహాలు ఇస్తాము.. కానీ వాళ్ళు పాటించారు. వాళ్లకు నచ్చినది వాళ్ళు చేస్తారు. అలాంటి వాళ్ళను మనం పట్టించుకోవడమే తప్పు. అందుకే సలహాలు తక్కువ ఇవ్వాలి. ఎవరికైన కావాలి.. ఏం చెయ్యాలి అని మిమ్మల్ని సలహా అడిగితే చెప్పండి.. లేదు అంటే నోరు విప్పకండి. అప్పుడే జీవితం బాగుంటుంది. 

 

అలాగే మనం ఒకరికి ఇచ్చే సలహాలు మనకు పనికి వస్తాయి అని చెప్పలేం. ఎందుకంటే? మనం ఒక కంపెనీకి సలహాలు ఇస్తాము.. ఆ కంపెనీ ఆ సలహాలు పాటిస్తే ఇంకాస్త ఉన్నత స్థాయికి ఎదుగుతుంది.. ఇంకాస్త ముందడుగు వేస్తుంది. ఒకేవేళ పాటించకపోతే అక్కడే ఉంటుంది. అంతేకదా! అది పాటించలేదు అని మధ్య తరగతి అయినా మనం కంపెనీ పెట్టి ఆ సలహాను ఆచరణలో పెట్టలేం కదా! అందుకే మనం ఒక పని చేసే ముందు మన స్థాయి ఏంటో కూడా గుర్తు పెట్టుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: