నేటి మంచిమాట.. ఇచ్చే బహుమతి కంటే, ఇచ్చే విధానంలోనే గొప్పతనం ఉంది! అవును. నువ్ కోటి రూపాయిలు బహుమతి ఇచ్చిన సరే నీకు ఆ గిఫ్ట్ ఏలా ఇవ్వాలో తెలియకపోతే ఆ బహుమతి వెస్ట్. అదే పది రూపాయిలు పెట్టి నవ్వుతు నీ కోసమే కష్టపడి తెచ్చా అని ఇవ్వు నీ బహుమతికి ఒక విలువ ఉంటుంది.. గొప్పతనం ఉంటుంది. అలా కాదు అని ఏలాంటి విలువ లేకుండా నీకు గిఫ్ట్ ఇచ్ఛ అని అంటే చాలా చిరాకుగా ఉంటుంది తీసుకునేవాళ్లకు. 

 

IHG

 

మనం ఇచ్చే బహుమానం ఎంత విలువైనది అయినా తీసుకునే మనిషికి మనపై ప్రేమ ఉండాలి. అప్పుడే వారు ఆనందంగా ఉన్నదీ చాలు అని అనుకుంటారు. నువ్వు నచ్చని వ్యక్తి ఎంత పెద్ద బహుమతి ఇచ్చిన ఫలితం ఉండదు. కనీసం ఆ బహుమతి ని గౌరవించాలి అనే మనసు కూడా ఉండదు. అలాగే మనం ఓ వ్యక్తికి ఇచ్చే బహుమతిని ఎంతో గౌరవంగా, ప్రేమగా ఇవ్వాలి. అప్పుడే ఆ బహుమతికి ఒక విలువ ఉంటుంది. 

 

IHG

 

ఇచ్చే విధానం అందంగా ఉంటే చిన్న బహుమతి అయినా విలువ పెరుగుతుంది. మనిషి విలువను పెంచేది ప్రవర్తనే. అలాంటి ప్రవర్తన అద్బుతంగా ఉంటే జీవితం బాగుంటుంది. ఇంకా అలానే మనకు ఇష్టమైన వారికి ఇష్టంగా బహుమతి ఇస్తే ఆ బహుమతికి ఒక విలువ ఉంటుంది. మనం ఇచ్చే బహుమతి కంటే మనం ఇచ్చే విధానానికే గొప్పతనం ఉండాలి. అలా మనం కూడా బహుమతిని గొప్పగా ఇవ్వాలి.  

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: