నేటి మంచిమాట.. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు.. నీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకో! అవును.. ఎవరినో చూసి వారిలాగా జీవించాలి అంటే నీ వల్ల ఎలా అవుతుంది? నీకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది కదా! నీలా నువ్వు బతుకు.. ఒకరి నుండి మంచి విషయాలు తీసుకోవచ్చు.. అంతేకాని వారిలానే ఉండాలి అని అనుకోకూడదు. 

 

మనిషి అంటేనే రెండు రకాలు. లోకానికి కనిపించే మనిషి ఒకరు.. కనిపించని మనిషి ఒకరు. నువ్వు కనిపించే మనిషిలా ఉండాలి అనుకోని అంత అలాగే ఉంటే ఇబ్బందులు పడుతావు. నీలా నువ్వు  బతుకు.. తప్పు అయినా ఒప్పు అయినా నీ లైఫ్ నీది కదా! ఎవరోలా జీవించడం నేర్చుకుంటే నిన్ను నువ్వు కోల్పోతావు. అందుకే నీకు నచ్చినట్టు జీవిస్తే ఆనందంగా జీవిస్తావు. 

 

అలాగే కొందరు తల్లితండ్రులు కూడా ఉంటారు.. ఎంత దారుణంగా ఉంటారు అంటే పక్కింటి పిల్లలతో పోలుస్తారు. ఏం అంటే? ఆ పిల్లడు నీతో పాటే చదువుతున్నాడు కదా! ఆ పిల్లడు నువ్వు ఓకే స్కూల్ లో చదువుతున్నారు కదా! వాడికి 90 మార్కులు రావడం ఏంటి ? నీకు 15 మార్కులు రావడం ఏంటి అని కంపార్ చేస్తారు. 

 

కానీ మీరు ఆలోచించండి.. మీ పిల్లాడు క్రికెట్ లో మంచి ఛాంపియన్.. మీరు అది తెలుసుకోకుండా ఊరికే చదువు చదువు అంటే చివరికి వాడు శవం అయ్యి కనిపిస్తాడు. పక్కన వాడు చదువులో మాత్రమే ఛాంపియన్.. జీవితంలో సున్నా. ఈ విషయం మీకు తెలియక లోకజ్ఞానం లేని వాడితో మీ ఛాంపియన్  పోల్చి లూజర్ చేస్తే ఏమైనా నా? అందుకే అందరూ గుర్తించుకొండి.. ఎవరి జీవితం వారిది.. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించాలి.. ఎవరో ఏదో చెప్పారు అని మనం వాళ్ళు చెప్పినట్టు జీవిస్తే మనం జీరో అవ్వడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: