నేటి మంచిమాట.. మంచితనం అనే పెట్టుబడి ఎప్పటికీ లాభాలను తెచ్చిపెడుతుంది! అవును.. ప్రస్తుత కాలంలో మంచితనం మించిన పెట్టుబడి లేదు. గొడవపడి.. కొట్టి.. తిట్టి సాధించలేనివి కూడా మంచితనంతో సాధించచ్చు. అది ప్రేమ అయినా.. ఆస్తి అయినా.. బంధుత్వాలు అయినా ఏవి అయినా మంచితనంతో సంపాదించచ్చు. 

 

మంచితనం అనేది పెట్టని ఆభరణం. ఎంతిమంది అంటుంటారు.. మంచిగా ఉండడం కూడా ఈకాలంలొ పాపమే అని. అందరూ మనల్ని మోసం చేస్తారు.. మనం సహాయం చేసిన గుర్తుపెట్టుకోరు.. ఈ మంచితనం నిజంగా మనిషికి మంచిది కాదు అని. కానీ మంచితనంతో ఉంటే తెలుస్తుంది. 

 

నిజంగా నువ్వు మంచివాడివి అయితే ఒకరి నుండి నువ్వు ఏమి ఆశించవు కదా! నువ్వు చేసిన సహాయం గుర్తుపెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోవాలి కానీ నువ్వు చేసినట్టు గుర్తుపెట్టుకోకూడదు కదా.. ఒకరికి సాయం చేసి గుర్తుపెట్టుకున్నావ్ అంటే నువ్వు అంత మంచివాడివి ఎం కాదు. 

 

మంచితనం అంటే ఆకలితో ఇంటికి వచ్చిన వారికీ ఇక చాలమ్మ అని కడుపునిండ అన్నం పెట్టడం. వృద్దులకు దొరకని ప్రేమను వారికీ అందించడం చెయ్యాలి. కష్టం వచ్చిందంటే నీకు చేతన అయినంత సాయం చెయ్యాలి. దాన్నే మంచితనం అంటారు తప్ప ఇంకేదో కాదు.. డబ్బు ఇచ్చిన కడుపు నిండదు.. కానీ కడుపునిండా అన్నం పెడితే మాత్రం చాలు అని అంటారు. 

 

ఇంకా ఈ మంచితనం చూసి.. ఎవరిని నమ్మని వారు కూడా మిమ్మల్ని నమ్ముతారు. ఎవరికి అప్పగించని బాధ్యతలు కూడా మీకు అప్పగిస్తారు. మీరు నమ్మకంగా ఉంటారు అనే ఉద్దేశ్యంతో మీకోసం ఏమైనా చేస్తారు. అందుకే అంటుంటారు.. మనకు ఏదైనా కావాలి అంటే అది కోపం, పగతో కాదు మంచితనంతో సాదించాలి అని.                                

మరింత సమాచారం తెలుసుకోండి: