ప్రతిరోజు లానే ఈరోజు కూడా ఇండియా హెరాల్డ్ మీకోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకు వచ్చింది.. అదేమిటంటే..తన కోపమే తనకు శత్రువు..తన శాంతమే తనకు రక్ష..  దీని వివరణ ఏమిటంటే మనిషికి కోపం ఉండకూడదు. ఎప్పుడైతే మనిషి కోపంగా ఉంటాడో,ఆ కోపమే వారికి శత్రువుగా మారుతుంది.. మనిషి శాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ శాంతమే మనిషిని రక్షిస్తుంది.. అని ఈ సామెత అర్థం ..


ఉదాహరణకు కోపం వచ్చిందనుకోండి.. సాధ్యమైనంతవరకు ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.. ఎందుకంటే కోపం అనేది మనిషి యొక్క ఆలోచనలను నాశనం చేస్తుంది. బుద్ధి క్షీణిస్తుంది. కోపంలో ఏం చేస్తున్నారో తెలియక.. చాలా తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా మనకు ఎంతో మంది శత్రువులను కూడా తెచ్చి పెడుతుంది. కాబట్టి వీలైనంత వరకు కోపాన్ని మన వద్దకు దరిచేరకుండా ఉండేలా చూసుకోవాలి..


ఇక శాంతం అనే పదం మంచితనానికి నిర్వచనం అని కూడా చెప్పవచ్చు.. మనిషి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటాడో, మనిషి యొక్క ఆలోచనలు రెట్టింపవుతాయి..  ఆలోచించే విధానం కూడా దశ విధాలా మంచిని చేకూరుస్తుంది.. నీకు ఎంత కోపం వచ్చినా సరే సంతోషంగా ఉంటే ఎంతటి శత్రువులైన సరే మిత్రుల అవ్వాల్సిందే .. అంతటి గొప్ప శక్తి శాంతం అనే పదానికి ఉంది.  అలాగే ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి..


 అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు.. కోపం వచ్చినప్పుడు సాధ్యమైనంతవరకు ఆ కోపాన్ని అదుపులో ఉంచడానికి ప్రయంత్నించాలి అని. ఒకవేళ కోపాన్ని అదుపు చేయలేని పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే దేనినైనా సాధించగలం.. ప్రశాంతంగా ఉండడం వల్ల ఎన్నో ఆలోచనలకు పునాది వేసినవారమవుతాము.

చూశారు కదా ఫ్రెండ్స్.. మీలో ఉన్న  కోపాన్ని తగ్గించుకుంటే, మీరు అత్యున్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అంతే కాకుండా మీకు మిత్రులు,బంధువులు ఎల్లవేళలా మీ తోడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు...

మరింత సమాచారం తెలుసుకోండి: