బేసిక్ లైన్ : మాధ‌వ్  శింగ‌రాజు

ఎక్స్‌టెండెడ్ థాట్ : ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

త‌లెత్తుకోవ‌డంలోనే మ‌హ‌త్తు ఉంది
ఆహా! ఇస్రో కానీ నేను కానీ మీరు కానీ  
చేయాల్సిన ప‌నే ఇది అని ఒకరి బోధ
ఉద్బోధ అని రాయాలి..ఆగిపోయాను!
ఆగి ఉన్న చోట ఉత్పాతం ఉంది నిర్దేశ‌మూ ఉంది
త‌లెత్తుకోవ‌డం కూడా ఆగిన చోట నుంచే ఆరంభం..
ఇట్స్ ఎ గ్రేట్ కిక్ స్టార్టింగ్ పాయింట్ ఫ‌ర్ మి

ఆగిపోవ‌డం ఉత్పాతం కాదు కొత్త ఆరంభం
ఇలా ఎందుకు ఆలోచించాలి ..
ఇలానే ఎందుకు రాయాలి..
చంద్ర‌మండ‌ల కాంతుల లేదా దీప్తుల ద‌య ఇది
ద‌య‌తో రాస్తున్న మాట‌లు ద‌య ఉంచే  చ‌ద‌వాలి
క‌రుణ‌నూ వాత్స‌ల్యాన్నీ ఇచ్చి పంపిన మాట‌లు
కొన్నే గుర్తుకు పెట్టుకోవాలి..మార్పు చూశాక‌
త‌లెత్తుకోవ‌డం ఈ లోకం నైజం.. మార్పు  చూశాక
గొంతుకలు క‌ల‌ప‌డం ఈ లోకం పాడే పాట‌కు ల‌క్ష‌ణం


దేశాన్ని ప్రేమించే శ‌క్తులు త‌లెత్తుకోవాలి
చదువరిని నేను త‌ల‌దించుకుని
కొన్ని వెన్నెల‌లు ఏరుకోవాలి
ఇవి అక్ష‌రాల లోగిళ్ల‌లో సంద‌ళ్లు చేసే
వెన్నెల కాంతులు క‌నుక
సంబంధిత ప్ర‌త్యేక గుణం
ఒక‌టి ఒంటికి పూసుకోవాలి
క‌ళ్ల‌కు అద్దుకోవాలి
హృద‌య‌గ‌తిని తీర్చిదిద్దే మంచి మాట‌కు
భార స‌హిత స్థితి ఉంటుంద‌ని గుర్తించాలి

కొన్నంటే కొన్ని ఆద‌ర్శ‌నీయం అయి ఉంటాయి. చుక్కలు, చంద‌మామ అంద‌కుండా ఉంటాయి. ప‌రిశోధ‌కుల ఆద‌ర్శాల‌కు నోబుల్ థాట్ అన్న‌ది ఉండాలి. ఉంటుంది కూడా! ఒక‌చోట ఆగిపోవ‌డంలో విశ్వాసం ఉంది అని నేను అనుకుంటాను. ఆగ‌డం విజ్ఞాన సంప దకు అడ్డు. కానీ సంప‌ద‌ను దాచుకునే ప్ర‌య‌త్నంలో ఆగిపోవ‌డం చేసే మేలు ఏంట‌న్న‌ది నాకు తెల్సు. విజ్ఞానం ఏద‌యినా నాలో గొప్పన‌యిన ఆనందాన్ని నింపిపోవాలి అన్న తాప‌త్ర‌యం చ‌దివే ప్ర‌తిసారీ ఉండాలి ప్ర‌తి ఒక్క‌రిలో! ఆదివారం చ‌దువు ఆధారంగా రాస్తున్న రాత ఇది.

 

దేశానికి మంచి చేసేవి ఏవ‌యినా మీరు మ‌ద్ద‌తు ఇవ్వాలి అని చెప్పారు నా ఇంఛార్జ్. గొప్ప మాట..అని తోచింది. దేశానికి మంచి చేసేవి అన్న ద‌గ్గ‌ర ఆగి ఆలోచించాల్సిన ప‌ని లేదు. త‌లెత్తుకు చూడ‌డంలో విడ్డూరం ఉంది అని చదివేను.కానీ త‌ల‌దించుకోవ‌డం లో మాత్రం అవ‌మానం ఉంది అని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. నింగీ నేలా మ‌ధ్య ఆకాశ‌మంత‌టి మ‌నిషి ఎవ్వ‌ర‌యినా ఉన్నారా? అని ఆ రా తీ యాలి అని అనుకున్నాక జీవితం ఒక విస్తారం అయిన లోగిలిలో న‌న్ను నాకు ప‌రిచ‌యం చేసిన సంద‌ర్భం ఒక‌టి వెతికాను. ఓట‌మి అనే ప‌దం ద‌గ్గ‌ర ఈ దేశం ఓడిపోతుంది అని ఒప్పుకోవ‌డం భావ్యం కాదు. ఇస్రో కు కూడా భావ్యం కాదు. కాకూడ‌దు కూ డా! త‌లెత్తి చూడ‌డం అన్న‌ది ఎవరికి వారు నేర్చుకోవాల్సిన ప‌ని అని చ‌దివేను.


 

త‌లెత్తుకోవ‌డం ఆకాశం ఒక్క‌టే కాదు లోకం మొ త్తం నెత్తిన పెట్టే భ‌రోసాను విశ్వాసాల‌ను ప్రేమించ‌డం కూడా  నేర్చుకోవాలి. తలె త్తుకోవ‌డంలో ఈ దేశం ముందుంటే నేను ఆనందిం చేను. తేలిక‌పాటి యుద్ధ విమానాల త‌యారీలోనో, లేదా ఒలంపిక్స్ లోనో లేదా వ్యవ‌సాయ సంబంధ ప‌రిశోధ‌న‌లోనో ఈ దేశం ఓ అడుగు ముందుకు వేసి త‌లెత్తి చూడ‌డం ఎలానో ప్ర‌పంచానికి నేర్పింది అని విశ్వ సించాను. ఇప్పుడు చెప్పండి త‌లెత్తుకోవ‌డం గౌరవ‌మా కాదా? కానీ ఓ ఆత్మ క‌థ అనుసారం త‌లెత్తి చూడ‌డంలో కొన్ని స‌మ‌స్య లు కొంద‌రికి ఉన్నాయి అని చ‌దివేను. ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ స‌ర్ కు ఈ త‌ర‌హా ఇబ్బంది ఉంది అని గుర్తించేలా రాశారు ఆ క‌థ‌నం. మాధ‌వ్ అనే కుర్రాడు రాశాడు. నేను విస్తృతం చేస్తూ రాస్తున్నాను. విస్తృతార్థాల‌ను వెతుకుతూ చ‌దువుతూ రాస్తున్నాను.


 

చ‌దువ‌రి జ్ఞాపకం అన్న‌ది ఎలా ఉంటుంది అన్న‌ది తెలియ‌జేస్తూ రాస్తున్నాను. త‌లెత్తు కోవ‌డం మార్పు .. స‌మాజంలో ఈ మార్పు ను ఆశించే ప్ర‌తి ప‌రిణామం నాలో చైత‌న్య వీచిక కావాలి అని ప్ర‌తి ఒక్క‌రూ విశ్వ‌సించండి. తలెత్తుకుంటే నిన్న‌టి వైఫ‌ల్యాలు పాదా ల కింద చేరి పోతాయి. తలెత్తుకుంటే గ‌గ‌న‌పు నీలి సౌంద‌ర్యాలన్నీ అక్ష‌రాల చెంత వ‌చ్చి వాలి కొత్త ఆనందాలు ఇచ్చిపోతాయి. త లెత్తుకోవ‌డంలో చుక్క‌లు తేలాయా లేదా రాలాయా అన్న‌ది కూడా తేలిపోతుంది అని చదివేను. శివ‌న్ స‌ర్ ఈ ప‌ని చేయాలి. చం ద్రయాన్ - 2 విఫ‌లం అప్పుడో లేదా జీఎస్ఎల్వీ విఫ‌లం అప్పుడో చెందే బాధ క‌న్నా నెర‌వేర్చిన బాధ్య‌త‌నొక‌టి చ‌దువుకుని గుర్తు తెచ్చుకుని ఆనందాన్ని అద‌నంగా పొందాలి. ఈ దేశ‌పు జెండా త‌లెత్తుకున్న ప్ర‌తిసారీ ఆనందించాలి అని ఓ సినిమాలో డైలాగ్ చె బుతోంది. అలా త‌లెత్తుకోవ‌డం రీత్యా ఈ దేశం ప్ర‌పంచంలో గొప్ప‌ది అన్న భావనొక్క‌టి నింగిపైకి చేరి మ‌న‌ల్ని పుల‌క‌రించేలా చే స్తుంది. త‌లెత్తుకోవడంతో పున్న‌మి వెలుగులు క‌నిపిస్తే లేదా విసిగిస్తే బాధ‌ప‌డ‌కండి శివ‌న్ అని ఓదారుస్తున్నాడు మాధ‌వ్. ఏ శా స్త్ర‌వేత్త అయినా త‌లెత్తుకోవ‌డంతోనే ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది లేదా ముగుస్తుంది అని కూడా అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: