ఒకప్పుడు సినిమాలలో నటించాలి అనే కోరిక అతి తక్కువ మందికి మాత్రమే ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఎవ్వరికీ ఇండస్ట్రీపై సరైన అవగాహన ఉండేది కాదు. అప్పుడు ఎవరైతే నటన రంగంలోకి అడుగు పెట్టారో వారంతా ఒక కమిట్మెంట్ తో సినిమా మీద ఫ్యాషన్ తో వచ్చినవారే. అలాంటి నటులలో ఒక నటుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా వాయల్పాడు కు  చెందిన నటుడు గంగసాని రామిరెడ్డి. కొందరికి తమ లుక్ వలన పాత్రలు వస్తూ ఉంటాయి. అలాగే కొందరికి తమలో ఉన్న  నటన వల్ల అవకాశాలు వస్తాయి. రామిరెడ్డి ముందుగా ఒక పత్రిక విలేఖరిగా పనిచేస్తూ ఉండేవాడు. ఈయన నటనపై ఉన్న ఆసక్తితో సినిమాలలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. మొదటగా సహాయ నటుడిగా అయినా నటించాలి కోరికగా ఉండేది. అయితే అంత సులభంగా సినిమా అవకాశం రాలేదు. అలా ఎంతో కష్టం తర్వాత ఒక సినిమాలో విలన్ గా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ జీవిత లు నటించిన "అంకుశం" చిత్రంలో విలన్ గా చేశాడు.  

ఆ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఘన విజయాన్ని సాధించింది. రాజశేఖర్ నటన ఒక హైలైట్ అయితే, అంతకు మించిన నటనతో రామిరెడ్డి విలన్ గా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు సినిమాకు ఒక విలన్ దొరికాడని అంతా అనుకున్నారు. అంటే ఆ సినిమా తర్వాత రామిరెడ్డి కి అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. ఇక వరుసగా ఒసేయ్ రాములమ్మ, పెద్దరికం, అమ్మోరు, గాయం, అనగనగా ఒక రోజు, అడవిచుక్క, నాగప్రతిష్ట, తెలుగోడు వంటి తెలుగు సినిమాల్లో నటించి విలన్ గా ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒక తెలుగులో మాత్రమే కాదు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం మరియు భోజ్ పురి లాంటి భాషలలో మొత్తం 250 చిత్రాలలో విలన్ గా చేశారు.

ఇతని జీవితంలో ఒక సంఘటన జరిగింది. నటుడిగా బిజీ గా ఉన్న సమయంలో 2007 జనవరి 29 న మద్యం సేవించి వాహనం నడిపిన కారణంగా పోలీసులు రామిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఒక విలన్ అయినప్పటికీ అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రోజునే బెయిలు మీద విడుదల చేయడం జరిగిపోయాయి. ఈ సంఘటన ఒక్కటే రామిరెడ్డి జీవితంలో ఒక పీడకలగా మిగిలిపోయింది. అలా కొంతకాలానికి సినిమాలలో కొత్త విలన్ లు పుట్టుకు రావడంతో రామిరెడ్డికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు అనారోగ్య సమస్య కారణంగా బాగా ఇబ్బంది పడ్డాడు.  మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి కారణంగా హైదరాబాద్ లో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న రామిరెడ్డి. 14 ఏప్రిల్ 19 2011 న సినిమా పరిశ్రమ ఒక మంచి విలన్ ను కోల్పోయింది. అలా అతని జీవితం ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: