తెలుగు సినిమా పరిశ్రమకు దక్కిన ఒక అరుదైన ఆణిముత్యం అక్కినేని నాగేశ్వరరావు. మద్రాస్ నుండి హైదరాబాద్ కు చిత్రసీమ తరలించడంలో రామారావు కలిసి చేసిన కృషి మరువలేనిది. ఈనాటికీ ఆయన పేరు తలుచుకొని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈయన చేసిన సినిమాల్లో పాత్రలు నేటికీ అంత ప్రసిద్ది చెందాయి. ఇప్పుడు ఏ ఎన్ ఆర్ జీవితంలో ముఖ్యమైన ఒక విషయం గురించి తెలుసుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు 1929 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా రామాపురం అనే గ్రామంలో జన్మించాడు. తన మనసులో చిన్న వయసు నుండే నటనపై ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉన్నాడు. చిన్నప్పుడు నటనపై ఉన్న ఇష్టంతో నాటకాలలో నటించేవారు. అయితే ఈ నాటకాల్లో ఎక్కువగా స్త్రీ పాత్రలు చేసి గుర్తింపు పొందాడు.

అక్కినేని నాటకాలను చూసిన ఘంటసాల బలరామయ్య, ఒక రోజు మద్రాస్ రైల్వే స్టేషన్ లో  ఆయనను చూసి తొలిసారిగా తన సినిమాలో ఒక నటుడిగా అవకాశం ఇచ్చాడు. అలా ఆయన నటనా రంగం వైపుకు  తొలి అడుగు పడింది. మొత్తం 75 సంవత్సరాలకు పైగా సినిమాలలో నటించి ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలను చేశాడు. ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన అంశం. నాగేశ్వరరావు అప్పట్లో కేవలం 25 సంవత్సరాల వయసులోనే అన్నపూర్ణ గారిని వివాహం చేసుకున్నారు. నాగేశ్వరరావు సినిమాల్లో అంత విజయవంతంగా కొనసాగడంలో అతని భార్య అన్నపూర్ణ గారి విలువైన హస్తం ఉంది. ఆమె మీద ఉన్న అమితమైన ప్రేమతో 1975 వ సంవత్సరంలో ఆమె పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ చేశాడు. నాగేశ్వరరావు కెరీర్ లో ఒక ట్రెండ్ సెట్టర్ హా నిలిచిన ప్రేమకథాచిత్రం ప్రేమాభిషేకం మూవీ ఈ బ్యానర్ లో తీసినదే కావడం విశేషం.  

సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనము చూశాము. అక్కినేని ఒక నటుడిగానే కాకుండా సమాజానికి సేవ చేయడంలోనూ ముందున్నాడు. గుడివాడ లోని కళాశాలకు  భూరి విరాళం ఇచ్చినందుకు అక్కినేని పేరునే పెట్టారు. అక్కినేని కొన్ని కారణాల వలన జీవితంలో చదువుకోలేక పోయాడు. అందుకే తన లాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండి చదువు కొనసాగించలేనివారికి విరాళాలు ఇచ్చేవాడు. అలా ఎంతో మంది గొప్ప గొప్ప చదువులు పూర్తి చేయడానికి కారణమయ్యాడు. ఇది జీవితంలో అతి తక్కువ మంది మాత్రమే చేస్తారు. ఇలా సమాజ సేవను కూడా చేయడంలో   అక్కినేని సక్సెస్ అయ్యాడు. అందుకే మరణించినా ప్రజల మనసులో కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: