సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గత రెండు సంవత్సరాల నుంచి స్వర్గస్థులు అవుతున్నారు. ముఖ్యంగా టాప్ సెలబ్రిటీలు మరణించడం సినీ ఇండస్ట్రీ లో కలకలం రేపుతోంది. ఇక కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఎంత మంది సెలబ్రెటీలను మన తెలుగు సినీ ఇండస్ట్రీ కోల్పోయిందో లెక్కల్లో చెప్పలేము. ఇక రీసెంట్ గా కూడా వరుసగా నెలలోపే 5 నుంచి 6 మంది సెలబ్రిటీలు ఇతర కారణాల చేత మరణించగా తాజాగా మరొక ప్రముఖ కొరియోగ్రాఫర్ కూడా కరోనాతో మృతి చెందడం అందరిని కలకలం రేపుతోంది. అయితే తాజాగా ఇదే సంవత్సరం మరో ప్రముఖ దర్శకుడు అయినటువంటి సాయి బాలాజీ కూడా కరోనా మహమ్మారి కాటుకు బలి కావడం గమనార్హం..


తెలుగు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి బాలాజీ ఏప్రిల్ 26 వ తేదీన ఇదే  సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా హైదరాబాదులో మరణించడం సినీ ఇండస్ట్రీకి అప్పట్లో తీవ్ర దుఃఖంగా మిగిలింది.  57 సంవత్సరాల వయసులో కరోనా వల్ల మరణించడం తో సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురి అయిందని చెప్పవచ్చు. ఈయన మొదటి సారి ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి దగ్గర ఎంతో నమ్మకంగా పని చేసేవారు. రవిరాజా పినిశెట్టి దగ్గర ఎన్నో విషయాలలో నైపుణ్యం నేర్చుకున్న సాయి బాలాజీ.. శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయినటువంటి శివాజీ, ఒరేయ్ తమ్ముడు అనే సినిమాలకు ఈయన సహాయం చేశారు.

ఇక దివంగత హీరో అయినటువంటి ఉదయ్ కిరణ్ చివరి చిత్రం అయినటువంటి జై శ్రీ రామ్ కి దర్శకత్వం కూడా ఆయనే వహించారు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా సాయి బాలాజీ సిరి ..అపరంజి.. హాలాహలం అనే సోప్ ఒపేరాలకు కూడా శివబాలాజీ పనిచేయడం గమనార్హం. ఇక పోతే ఇలాంటి ఒక గొప్ప దర్శకుడిని సినీ ఇండస్ట్రీ కరోనా కారణంగా కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: