ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంటే ముఖానికి మేకప్ వేసుకుని.. నాలుగు పంచ్ డైలాగులు చెప్పేస్తే సరిపోతుందని అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఒక్క హిట్ మూవీతో సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ మొత్తం యూటర్న్ చేసుకోవచ్చు. అంతలా ఫ్యాన్ ఫాలొయింగ్ పెరుగుతుంది. చిన్న ఫోటో పెట్టినా.. లక్షల్లో వ్యూస్ సంపాదించుకునే వారూ ఉన్నారు. అయితే ఇప్పట్లో ఉన్నట్లు.. అప్పట్లో సినీ నటీనటులు లేరు. హార్డ్ వర్క్‌ ను నమ్ముకుని పని చేసే ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. సినిమా కోసం ప్రాణాలు పెట్టే వాళ్లు ఆ కాలంలో ఎంతో మంది ఉన్నారు. నటన మీద మక్కువతో.. తమ వ్యక్తిగత జీవితాలను సైతం పక్కన పెట్టిన నటీనటులు ఎందరో చిత్ర పరిశ్రమలో కొనసాగారు. అలాంటి వారిలో రచయిత పింగళి నాగేంద్ర రావు, ఆర్టిస్ట్ పాల్ దొరస్వామి ఉన్నారు.

దొరస్వామికి నటనంటే ఎంతో పిచ్చి.. ప్రాణం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలపై ఉన్న మక్కువతో తన వైవాహిక జీవితాన్నే త్యజించుకున్నారు. వివాహ బంధానికి దూరంగా ఉంటూ సినిమాల్లో నటించారు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడమే కాకుండా.. తన తుది శ్వాస వరకు సినిమానే జీవితంగా బతికారు. అప్పట్లో ఆర్టిస్ట్ పాల్ దొరస్వామి అంటే తెలియని వారు లేరు. ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేది. వందేమాతరం, సుమంగళీ వంటి సినిమాల్లో హీరోకు తండ్రిగా నటించారు. ఆ పాత్రలకు ప్రాణం పోసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

పాల్ దొరస్వామి సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్నారంటే.. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసేవారు. హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించిన ఈయన.. విలన్ పాత్రల్లో కూడా ప్రేక్షకులను మెప్పించారు. ‘మల్లేశ్వరి’ సినిమాలో మల్లేశ్వరి తండ్రిగా కూడా నటించారు. ‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో విలన్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. అప్పట్లో ఆయన డేట్స్ కూడా ఖాళీగా ఉండకపోయేవి. దర్శక నిర్మాతలు ఆయన కోసం క్యూ కట్టేవారు. సహజ నటుడిగా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దొరస్వామి.. సినిమానే జీవితంగా భావించారు. ఇలాంటి డేడికేషన్ ఉన్న నటులు ఇప్పట్లో దొరకడం కష్టమనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: