ఎవరైనా సరే వారి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వారికి తెలియకుండానే వీటిని పోగొట్టుకునే తప్పులను చేస్తుంటారు. తద్వారా ఇంట్లో ఆర్థిక సమస్యలు, చిక్కులు, చికాకులు తలెత్తుతుంటాయి. అలా జరగకుండా మన జీవితం సాఫీగా సాగడానికి, దేవుని కృపతో పాటు  మన వంతు ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అలాంటి పనులు ఏమిటో... ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా చెప్పాలంటే అందరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి.. ముఖ్యంగా స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు వేయాలి.
 
అప్పుడే ఆ దేవుని యొక్క చల్లని చూపు మనపై ఉంటుంది. ఇల్లు శుభ్రంగా లేనిచోట ఆ శ్రీ మహాలక్ష్మి కొలువు ఉండదు. ఇల్లు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో  ముక్కోటి దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారు. వారి యొక్క అనుగ్రహం ఆ ఇంటి కుటుంబసభ్యులపై ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసి, ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే... చాలా మంది తెలియక ఇంటి గుమ్మం ఎదురుగా చెప్పులు వదులుతుంటారు. ఇది చాలా అపచారం. ఇంటి గుమ్మం  సాక్షాత్తు ఆ మహాలక్ష్మి తో సమానం.... అలాంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచితే లక్ష్మీ మాతను అవమానించినట్లే అవుతుంది. కాబట్టి చెప్పులు ఎప్పుడూ ఇంటి వెలుపల ఒక మూలన ఉంచాలి.

ఇక మరో విషయం ఏమిటంటే... చాలామంది భోజనం తిన్న  ప్లేట్ లోనే చేతులు కడుగుతుంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్నం తిన్న ప్లేటు లో ఎంగిలి చేతిని కడగరాదు. అదే విధంగా ఒకసారి ప్లేట్ లో భోజనం పెట్టాక... కాలయాపన చేయరాదు. భోజనం ఎప్పుడూ మన కోసం ఎదురు చూడ కూడదు... అన్నం పెట్టుకున్న వెంటనే తినేయాలి. అలాగే ఆహారాన్ని క్రింద పడేలా తిని వృధా చేయరాదు. మరో విషయం ఏమిటంటే తినే చేత్తో మరో వస్తువు ముట్టుకో రాదు. చాలామంది ఎంగిలి చేతితోనే భోజనాన్ని వడ్డించుకొని తింటుంటారు... ఇది చాలా తప్పు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం తెప్పించినవారము అవుతాము. పైన చెప్పిన విషయాలు పాటించడం వల్ల ఆ దేవుని అనుగ్రహం తో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: