ఏ ఇల్లయినా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఆ ఇంటిపై ఉండాల్సిందే. అలా జరగాలంటే ఆ ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. ఇల్లన్న తర్వాత ప్రతిరోజూ మనం శుభ్రం చేస్తూనే ఉంటాం. ఇల్లు ఊడ్చిన తర్వాత తడి బట్టతో శుభ్రంగా తుడుస్తాం. ఇలా నిత్యం చేయాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. అదే విధంగా శుభ్రం చేసిన ఇంట్లో చిన్న చిన్న ముగ్గులు వేసినట్లయితే మహాలక్ష్మి మరింత ఇష్ట పడుతుంది. అయితే అలా మన ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మిని మన ఇంట్లోనే ఉండిపోయేలా ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఏ వారం ఇల్లు కడిగి శుభ్రపరుచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండి ఐశ్వర్యాన్ని అందిస్తుంది అంటే, ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మరియు శనివారం. 

ఈ నాలుగు వారాల్లో ఇల్లు కనుక కడిగి ముగ్గులు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఇంటిని శుభ్రపరిచే నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసి ఆ నీటితో ఇల్లు శుభ్రపరిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంద గలరు. అదే విధంగా శుక్రవారం నాడు ఇంట్లో పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇల్లు శుద్ధి అవుతుంది. అలాగే బయట నుండి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా పసుపు నీటితో ఇంట్లో నలుమూలలా చేయడం మంచిది.

ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే సోమ, శుక్ర, బుధ మరియు శని వారాల్లో ఇంటిని కడిగి ముగ్గులు వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం అంతా పోయి మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు. ఇక ఎందుకు ఆలస్యం రేపటి నుండే ఇలా చేయడం ప్రారంభించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: