శుక్రవారం నాడు హిందువులు లక్ష్మిదేవికి ప్రత్యేకించి పూజలు చేస్తుంటారు. శుక్రవారం రోజు చాలా మంది మహిళలు  తెల్లవారు జామునే లేచి సూర్యోదయం కన్నా  ముందే ఇంట్లో అన్ని పనులను చక్కబెట్టి తలస్నానం ఆచరించి  సూర్య నమస్కారం చేసుకుంటుంటారు ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం వారిపై ఉంటుందని నమ్మకం. అయినా ఇందులో నిజం లేకపోలేదు. లక్ష్మీ దేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే మన ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పూజ గదిని, వంటింటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అశ్రద్ధ పనికి రాదు. అదే విధంగా శుక్రవారం పూజ చెసే సమయంలో మహిళలు పచ్చని గాజులు వేసుకుని పూజ చేయడం చేత అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని పండితులు చెబుతున్నారు. 

ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఎడమ చేతికి ఆరు, ఎనిమిది లేదా  పన్నెండు గాజులను వేసుకుని కుడి చేతికి మాత్రం ఎడమ చేతి కంటే ఒక గాజు ఎక్కువగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత శ్రీ మహాలక్ష్మి పూజను చేస్తే సర్వ శుభాలు కలుగుతాయని, మీ కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని చెబుతున్నారు.  అయితే పెట్టే చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది. కేవలం పూజలు వ్రతాలు చేయడమే కాదు. అదే చేతితో సాయం కోసం ఎదురు చూసే వారికి మీకు వీలైనంత సహాయం అందిస్తే ఆ పుణ్యఫలం మీ అభివృద్ధికి దోహదపడుతుంది. 

మీ కుటుంబానికి రక్షగా మారుతుంది. చేయిచాచి అడుక్కునే వారికి 10 రూపాయలు వేయడానికి కూడా ఆలోచించి చిల్లర లేదనే వారు దేవుడి హుండీలో వెయ్యి రూపాయలు వేసినా అది మీకు పెద్ద ప్రయోజనం ఉండదు. మానవసేవే మాధవసేవ అన్నారు పెద్దలు. ఎప్పుడైతే నిర్మలమైన మనసుతో దేవుని పూజిస్తామో అప్పుడే ఆనందాలు మీ వెన్నంటే ఉంటాయి. పై విధంగా చేయడం వలన లక్ష్మి దేవి కరుణ కటాక్షం మీపై ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: