కోర్టు తీర్పు తర్వాతనే :  రాజ్ నాథ్ సింగ్
భారయ్యులందరికీ వసుదైక కుటుబమని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కోన్నారు.భారత దేశంలో విభిన్న సంస్కుృతులు, కులాలు,జాతుల సమ్మెళనమని తెలిపారు.  రామజన్మభూమి ట్రస్ట ప్రధానకార్యదర్శి చంపక్ రాయ్, మాజీ ఎం.ఎల్.ఏ విజయ్ జాలీ నేతృత్వంలో ఓ స్వచ్చందసేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో  కేంద్ర మంత్రి పాల్గోన్నారు. శ్రీరామ చంద్రమూర్తి జన్మస్థలం అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిరానికి వివిధ దేశాల నుంచి  వచ్చిన జలాల్ని రాజ్ నాథ్ సింగ్ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు తీర్పు వచ్చిన తరువాతనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం  రామ మందిర నిర్మాణానికి పూనుకున్నదని తెలిపారు. అయోధ్యలో సప్తసాగర్ ఉండేదని పూరాణాలు , చరిత్ర చెపుతోందన్నారు. దీనిని దృష్టిలోఉంచుకుని వివిధ దేశాల నుంచి  పవిత్ర జలాలను తీసుకు వస్తున్నారని తెలిపారు. వివిధ దేశాల నుంచి నీటిని సేకరించడం వినూత్న ఆలోచన గా కేంద్ర మంత్రి అభివర్ణించారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు పవిత్ర నీటిని పంపేందుకు ఆసక్తి కనబరస్తున్నారని రాజ్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం  117 దేశాల నుంచి జలాలు వచ్చాయని, మరి కొన్ని దేశాల నుంచి పవిత్ర నీరు  రావాల్సి ఉందన్నారు. విదేశాల్లోని హిందువులే కాకుండా, ముస్లింలు, క్రిస్టియన్లు  పవిత్ర నీరు పంపించేందకు ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. నైజీరియా, ఫిజీ, డెన్నార్క్ దేశాల రాయభారులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఓ పండుగ వాతావరణాన్ని తలపించింది.
వీరప్పమొయిలీతో వేదికను పంచుకోనున్నారా?
మాజీ కేంద్ర మంత్రి వీరప్పమొయిలీతో రాజ్ నాథ్ సింగ్ ఒకే వేదికను పంచుకోనున్నారా? ఈ నెల 23న ఇండియన్  స్టూడెంట్ పార్లమెంట్ పేరుతో ఒక సదస్సు జరగనుంది. పునేలో ఎం.ఐ.టి స్కూల్ దీనిని ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ,  మాండవీయ తదితరులు పాల్గోంటున్నారు. కీలకోపన్యాసం చేసే వక్తల జాబితాలో  వీరప్ప మొయిలీ పేరు కూడా ఉంది. మహారాష్ట్ర మాజీ  ముఖ్యమంత్రి ఫడ్నవీస్ , వివిధ రాష్ట్రాల ప్రముఖులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: