ఆశ్వీజమాసం వచ్చిందంటే భక్తులు స్వామివారి బ్రమ్మోత్సవాలలో పాల్గొంటారు. మరోపక్క శక్తీ ఆరాధకులు ముఖ్యంగా బెంగాల్ లో పూజలు చేస్తారు. శక్తీ క్షేత్రాలలో ఈ పూజలు జరుగుతాయి. రెండు ఒకేసారి ఎందుకు అంటే ఇద్దరు అన్నాచెల్లెళ్లు. ఇద్దరు దాదాపు ఆవిర్భవించిన సమయం ఇదే. స్వామి శ్రవణం నక్షత్రం ఏకాదశి ఉన్ననాడు ఆవిర్భవించారు. ఆశ్వీజమాసంలో పాడ్యమినాడు అమ్మవారు ఆవిర్భవించింది. తొమ్మిది రోజులు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసి 9నాడు రాక్షస సంహారం చేసింది. అందుకే అమ్మవారిని పూజించే ఆచారం మనకు ఉంది. శక్తీ లేకపోతే శక్తుడు అన్నవాడు ఆసక్తుడు అయిపోతాడు. అందుకే శక్తీ ఆరాధన అవసరం. అయితే ఆ శక్తి ఏమిటి అని అడిగితే ఆయా సందర్భాన్ని బట్టి ఆయా అవతారాలలో ఆవిర్భవించింది. అందుకే ఆదిశంకరులు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో చెప్పారు.. ఈ శ్లోకం లలితారహస్య సహస్రనామం కు కవితత్కామైన వ్యాఖ్యానం లాగ కనిపిస్తుంది.

అంటే ఎవరు లేకపోయినట్టైతే బ్రహ్మ సృష్టి, విష్ణువు స్థితి కరకం చేయడానికి, రుద్రుడు లయం చేయడానికి శక్తులు అవుతున్నారో అవన్నీ వాళ్ళు చేయలేరు. అందుకే శక్తీ తోడుగా ఉండటం అవసరం. ఆ శక్తిని పూజించాలంటే పూర్వజన్మ పుణ్యం ఉండాలని అంటారు. అందుకే ఈ నవరాత్రులను శక్తీ ఆరాధన కాలంగా చెపుతారు. శరదృతువు, వసంతఋతువులు ఆరు నెలల తేడాతో వస్తాయి. అంటే ఈ కాలాన్ని యమద్రంస్టలుగా చెప్తారు. అంటే ఒక్కసారిగా వేడి, చలి; ఒక్కసారిగా చలి, వేడి గా వాతావరణం మారుతుంది. దానికి తగ్గట్టుగా శరీరం సిద్ధం కావాల్సి ఉంటుంది. వ్యక్తికి శారీరిక(సీజనల్ రోగాలు), మానసిక(చంచలం అయ్యే స్థితి), ఆత్మపరం(ఉద్ధరణకు చేయవలసిన సాధన)గా ఆర్యోగం అవసరం. కుటుంబ, సామజిక పరంగా కూడా వాతావరణం వలన అనేక శక్తీ ఆరాధన చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని చెప్పడమే నవరాత్రుల ఆరాధన.

ఈ ఆరాధన చేయడం వలన వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి మేలు జరుగుతుంది. అంటే మనిషి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటే సమాజం సజావుగా నడుస్తుంది. అంటే ఎక్కడ జీవించాల్సిన అవసరం ఉందొ అక్కడ మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి, అతడి శారీరిక, మానసిక, ఆత్మపరంగా ఏవిధంగా వాటిని సాధించుకోవాలి అనేది ఈ నవరాత్రులలో శక్తీ ఆరాధన వలన చెప్పబడుతుంది. అందుకోసం అడ్డువచ్చే విషయాలు రాక్షసులు అనుకుంటే, వాటిని దాటటం అంటే రాక్షసులను చంపడం, తద్వారా విజయం సాధించడం. ఈ విశ్వములో అత్యున్నత ప్రాణి కేవలం మనిషి. అందుకే ఈ మనిషి సరిగ్గా ఉంటేనే ఇతర ప్రాణుల జీవనం ఆధారపడుతుంది. అందుకే అతడి శ్రేయస్సు కోసం ఈ దైవం, శక్తీ ఆరాధనలు ఆయా ధర్మాల ప్రకారం సాంప్రదాయంగా తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: