దసరా పండుగ వచ్చిందంటే చాలు ఊరువాడ ఎంత సందడి వాతావరణం నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారందరూ  సొంత ఊర్లకు చేరుకుంటూ ఉండడంతో అప్పుడు వరకు ఎవరు లేక బోసిపోయినట్లు కనిపించిన గ్రామాలు దసరాకి మాత్రం కళకళలాడుతూ పండగ శోభ ని సంతరించుకుంటూ ఉంటాయి. అయితే దసరా పండుగ వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు ధరించి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ  దసరా శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు.


 అంతే కాదు ఎంతో మంది యువత పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు. అయితే విజయదశమి నాడు ఎన్నో రకాల సాంప్రదాయాలు ఆచారాలు పాటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయదశమి రోజు ప్రతి ఒక్కరు జమ్మి చెట్టును పూజించడం మాత్రం తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. జమ్మిచెట్టు పూజ చేసి జమ్మి ఆకులను పేదలకు పంచి వారి దగ్గర్నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారంగా చెబుతూ పంచుకుంటూ ఉండటం అందరికీ తెలిసిందే.


 కానీ జమ్మిచెట్టుకు మాత్రమే ఎందుకు పూజ చేస్తారు.. మిగతా చెట్లకి ఎందుకు పూజ చేయరు. జమ్మిచెట్టు ప్రాధాన్యత ఏమిటి అన్నది మాత్రం చాలామందికి తెలియదు. అయితే ఇలా జమ్మి చెట్టుకు పూజలు చేయటం వెనుక పురాణ గాధలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికిన సమయంలో దేవతా వృక్షాలు ఉద్భవించాయట. అందులో ఒకటే ఈ జమ్మి చెట్టు అని చెబుతూ ఉంటారు. ఇక త్రేతాయుగంలో జమ్మి చెట్టుకు పూజ చేసి వెళ్లిన రాముడు రావణుని మీద విజయం సాధించాడు అంటూ రామాయణ గాధ చెబుతుంది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక  జమ్మి వృక్షం పై ఉంచుతారూ. ఆ తర్వాత అరణ్యవాసం ముగియగానే ఇక జమ్మి చెట్టుకు పూజ చేసి తమ ఆయుధాలను తీసుకెళ్లడంతో కౌరవులతో యుద్ధం తో గెలుస్తారట. ఇలా దసరా రోజు జమ్మి చెట్టు పూజ చేయడానికి ఎన్నో పురాణ గాథలు  ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: