హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకొనే అతి పెద్ద పండుగ గా కొనసాగుతుంది విజయదశమి. విజయదశమి వచ్చింది అంటే చాలు ఊరు వాడ అనే తేడా లేకుండా అంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. చదువు ఉద్యోగం వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారందరూ కూడా సొంతూళ్లకు చేరుకుని విజయదశమిని కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దీంతో  పల్లెలు మొత్తం పండుగ శోభను సంతరించుకుంటాయ్. .  ఎక్కడ చూసినా కూడా దుర్గమ్మ నామస్మరణ వినిపిస్తూ ఉంటుంది.  అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా విజయదశమిని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.



 ఇకపోతే విజయదశమి వచ్చింది అంటే చాలు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  ఎంత నిరు పేదలు అయినా సరే విజయదశమినాడు కొత్తబట్టలు ధరిస్తూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇలా కొత్తబట్టలు ధరించి విజయదశమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.  అంతేకాదు విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.  గ్రామస్తులందరూ ఒక్కసారిగా వెళ్లి జమ్మిచెట్టుకు పూజ చేసి జమ్మి ఆకులను తమతోపాటు తెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.  అంతేకాదు దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు.



 అయితే ఇలా విజయదశమి నాడు పాలపిట్ట ని చూస్తే ఎంతో మంచి జరుగుతుంది అని అందరూ నమ్ముతూ  ఉంటారు. కాని దీని వెనుక కారణం ఏముంది అన్నది మాత్రం చాలామందికి తెలియదు. పురాణ కథల ప్రకారం పూర్వం పాండవులు అరణ్య వాసాన్ని ముగించుకుని రాజ్యానికి వస్తున్న సమయంలో సరిగ్గా విజయదశమి రోజు వారికి పాలపిట్ట కనిపిస్తుందట. ఇక అప్పటినుంచి పాండవులు అందరికీ కూడా అన్ని విజయాలే సిద్ధిస్తాయని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే దసరా పండగ రోజు పాలపిట్టను దర్శించుకుంటే పాపాలు తొలగిపోయి సిరిసంపదలు లభిస్తాయని.. అనుకున్న పనులు అవుతాయని స్వర్గ ప్రాప్తి పొందుతారు అంటూ ఎంతో మంది ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: