జీవితం అన్నాక అందులో ఆనందం,దుఃఖం అనేవి ఉండనే ఉంటాయి. అయితే మన పూర్వపు గ్రంథాలు తెలిపిన ప్రకారం.. ఒక వ్యక్తి  తన జీవితంలో అనేక సార్లు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటాడు. అది కేవలం అతడి స్వంత కర్మ.


మంచి పనులు మనిషి జీవితాన్ని బాగా మెరుగు పరుస్తాయి. చెడు పనులు మనిషికి ఎక్కువ బాధలు కలిగించి సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. అలా ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల నుండి విముక్తి పొందాలంటే.. అతను ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం.


1). పురాణాల ప్రకారం మనం భోజనం తయారు చేసిన తర్వాత మొదటి సారిగా ఆవుకు పెట్టి, మిగిలిన ఆహారన్ని కుక్కలకి పెట్టాలి. ఇక ఇదే కాకుండా పక్షులకు, చేపలకు ఆహారంగా ఏదో ఒకటి చేయాలి.

2). ఎన్ని దానాలు చేసినప్పటికీ అన్నదానం అనేది చాలా చాలా గొప్ప దానంగా పరిగణిస్తారు. మనం నిరుపేదలకు ఆహారాన్ని ని దానం చేయడం వలన ఆ చేసిన వ్యక్తికి, ఏడు తరాల వరకు సుఖసంతోషాలతో ఉంటాడు అన్నట్లుగా పూర్వపు గ్రంథాలయాల్లో రాసి ఉంది.

3). ప్రతిరోజు దేవుడు ముందర కొద్ది సమయాన్ని కేటాయించి అక్కడ ధ్యానం చేయడం వల్ల, వారి కుటుంబంలోని సంతోషాన్ని, శాంతి నింపేందుకు దేవుడు అన్ని విధాల సహాయ పడుతాడు. ముఖ్యంగా డబ్బు సంపాదించే విషయంలో అడ్డదారులకు వెళ్ళకూడదు.

4). ఎన్నో తరాల నుంచి వస్తున్న మీ దేవుడి పూజలను వదిలి వేయకూడదు. వాటికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉండాలి.

5). మనకు దేవుడు నుంచి ఏది లభించినా కూడా.. అది దేవుడు మనకిచ్చిన వరం లాగానే భావించాలి. దేవునికి మనం కేవలం కృతజ్ఞతలు మాత్రమే తెలియజేయగలరు. మనకు లభించిన ప్రతిది ముందుగా దేవుడు పాదాల దగ్గర ఉంచి ఆశీర్వాదాలు తీసుకోవాలి. అలా మన ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా మొదట దేవుడికి కొంచెం పెట్టడం వల్ల.. లక్ష్మీదేవి ఆ కుటుంబం పై కృప చూపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: