మనం గుళ్లో దేవుడి దర్శనం కోసం వెళితే అక్కడ మనకు తీర్థం పోస్తారు గుళ్లో అర్చకులు. అయితే ఆ తీర్ధాన్ని ఎలా తాగాలి, తీర్థం ఎందుకు పోస్తారు, వాటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం.


గుడి అంటేనే మనకు ఎక్కువగా తీర్థ ప్రసాదాలు, దేవుడు అభిషేకం ఇతర పదార్థాలను జతచేసి అక్కడికి వచ్చిన భక్తులకు ఇస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా కొంతమంది పాలాభిషేకం, రుద్రాభిషేకం వంటి చేయిస్తూ  ఉంటారు. పూజారులు ఎన్నో మంత్రాలతో వాటిని దేవునికి సమర్పించి ఆ తర్వాత భక్తులకు వాటిని ప్రసాదంగా  పంపిస్తూ ఉంటారు.


శివాలయంలో అయితే ఎక్కువగా ప్రసాదంగా పంచామృతంని వేస్తారు. ఈ ప్రసాదాన్ని ముందుగా దేవుడు పూజ అయిపోగానే ముందుగా పూజారి తీర్థం సేవించి ఆ తర్వాత భక్తులకు ఇస్తారు. అయితే ఆ తీర్థాన్ని ఎలా తీసుకోవాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. తీర్థం మగవారు అయితే భుజంపై ఉండేటువంటి కండువాను, ఆడవారు అయితే తమ చీరను లేదా చున్నీ నీ ధరించే టప్పుడు ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా మడుచుకొని ఎడమవైపు వేసుకోవాలి. ఇక ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతల్లో కుడి చేతిని ఎడమ చేతి లో వేసి.. ఇప్పుడు చూపుడు వేలు ఏ మాత్రం తగలకుండా బొటనవేలును నడిమి వ్రేలికి కింద కడుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టుకుని తీర్థం కింద పడనీయకుండా నోటి నుండి శబ్దం రాకుండా తాగాలి.

తీర్ధాన్ని కేవలం 3 సార్లు మాత్రమే తీసుకోవాలి. అలా ఎందుకు తీసుకోవాలంటే..
1). మొదటిసారి శారీరక, మానసికం ఉండేందుకు.
2). రెండోసారి న్యాయ ధర్మ ప్రవర్తన గా నడిచేందుకు.
3). మూడవసారి పరమేశ్వరుని అనుగ్రహం పొందేందుకు.

ఇక ఇందులో పలు రకాలైన తీర్థాలు కూడా ఉన్నవి. జల తీర్థం, కాషాయ తీర్థం, పానక తీర్థం,పంచామృత తీర్థం, ఒక్కో దానికి ఒక్కో విశిష్టత ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: