కార్తీక మాసం శివ కేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ నెలలో  హిందూ భక్తులు వెకువఝాముననే లేచి స్నానాలు  చేసి  శివాలయాలకు వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటారు.  అవకాశాన్ని బట్టి విష్ణుమూర్తి ఆలయాలకు కూడా వెళ్లి  దేవుని దర్శనం చేసుకుంటుంటారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 22న కార్తీక దీపోవత్సవం నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని బెంగుళూరులో  పెద్ద ఎత్తున నిర్వహించాలని టిటిడి పాలక మండలి గతంలో నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మైకి టిటిడి ఆహ్వానం పలికింది. టిటిడి పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి  ఈ మేరకు ఆహ్వానించారు. తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్ కు హాజరైన  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో  వైవి సుబ్బారెడ్డి  సమావేశమయ్యారు. టిటిడి దేశ వ్యాప్తంగా చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలను వైవి సుబ్బారెడ్డి వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న దేవాలయాల గురించి  టిటిడి చైర్మన్ వివరించారు. ఈ నెల 19న తిరుపతిలో, 22వ తేదీ బెంగుళూరులో, అదే విధంగా 29వ తేదీ విశాఖపట్టణంలో కార్తీక ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.టిటిడి ఆధ్వర్యంలోని ధార్మిక ఛానల్ ఎస్.వి.బి.సి ఛానల్ ఇటీవల కన్నడ భాషలో నూతనంగా కార్యక్రమాలను అందిస్తున్నదని వైవి సుబ్బారెడ్డి  తెలిపారు.
.అన్న దానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాదం ట్రస్ట్ కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శ్రీ గణేష్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ యజమాని సోమశేఖర్ గౌడ్, రూ 10 లక్షల వెయ్యి 16 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆయన . టిటిడి  పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి కు అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ttd