హిందూ మతంలో ఒక్కో సాంప్రదాయానికి ఒక అర్థం ఉంటుంది. సాధారణంగా హిందువులంతా ఎక్కువగా నమస్కరించడం, పెద్దల పాదాలను తాకడం వంటి ఆచారాలను శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. అయితే నేటికీ ఈ ఆచారాలు భారతీయులలో ఖచ్చితంగా కనిపిస్తాయి. అయితే ఈ ఆధునికయుగంలో అలాంటి ఆచారాలను పక్కనబెట్టి అవన్నీ పనికి రావు అంటూ సమర్పించుకునే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారికి  సంస్కృతికి సంబంధించిన నియమాలు, ఆచారాల గురించి కచ్చితంగా తెలియజేయాలి. నేటి తరం యువతకు ఆయా ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలను కూడా అర్థమయ్యేలా చెప్పాలి. జీవితానికి అన్వయించుకునే టప్పుడు మనసులో ఎటువంటి సంకోచం ఉండకుండా అన్ని రకాలుగా భారతీయ సంప్రదాయాలకు సంబంధించిన శాస్త్రీయ వాస్తవాల గురించి చెప్పాలి.

నమస్కరించడం
భారతీయ ప్రజలు ఎవరైనా గౌరవంగా పలకరించడానికి నమస్కారం చేస్తారు. కరోనా మహమ్మారి నమస్కారం ప్రాముఖ్యతను ప్రజలకు మరింతగా అర్థం అయ్యేలా చేసింది. అయితే నమస్కారం చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవం ఏమిటంటే... అలా చేసినప్పుడు రెండు చేతులు, వాటి వేళ్ళు కూడా ఒకదాన్నొకటి తాకుతాయి. ఆ సమయంలో ఆక్యుప్రెజర్ మన కళ్ళు చెవులు మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.

పాదాలు నమస్కరించడం
ఎవరైనా పెద్ద వ్యక్తి కనిపిస్తే, తీసుకునేందుకు భారతీయులు పాదాలను తాకుతారు. అలా పాదాలను తాకడం ద్వారా మనస్సు నుంచి వెలువడే సానుకూల శక్తి చేతులు కాళ్ళ ద్వారా ప్రవహించి ప్రతికూలతలు తొలగిస్తుంది.

తిలకం దిద్దడం
పూజ జరుగుతున్న సమయంలో, లేదంటే ఏదైనా శుభ సందర్భంలో నుదుటిపై తిలకం దిద్దుతారు. అయితే ఇలా చేయడం వెనుక ఉన్న అసలు వాస్తవం ఏమిటంటే... మన మధ్యలో ఒక చక్రం ఉంటుంది. పనిని పీనియల్ గ్రంథి స్థానం అంటారు. ఆ ప్రదేశంలో తిలకం పూస్తే సీనియర్ గ్రంథి ఉత్తేజితమై సూక్ష్మ స్థూల భాగాలు ఉంటాయి. అంతే కాకుండా దీని వల్ల ఎండార్ఫిన్స్, సెరటోనిన్ వంటివి సమతుల్యం అవుతాయి. కోపం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

నేల మీద తినడం
 ఈ రోజుల్లో నేల మీద తినడం చాలా తక్కువ అయిపోయింది కానీ.. ఒకప్పుడు మాత్రం బంధువులు వచ్చినా సరే నేల పైన కూర్చో పెట్టి తినమని అనేవారు. కొంతమంది తినే సమయంలో పీటపై కూర్చుంటారు. ఇలా కూర్చోవడం కూడా మంచి చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

తలపై కుంకుమ దిద్దడం
పెళ్లయ్యాక హిందువులైన భారతీయ మహిళలు నుదుటిపై కుంకుమ దిద్దుతారు. అంటే ఆ భాగం చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. సింధూరం లో పాదరసం ఉంటుంది అది ఔషధంలా పనిచేస్తుంది. మహిళల్లో రక్తపోటును తగ్గించడానికి కాకుండా ఒత్తిడి నిద్రలేమి సమస్యను నియంత్రిస్తుంది. అలాగే లైంగిక ప్రేరణను కూడా పెంచుతుంది. అందుకే పెళ్లికాని అమ్మాయిలు వితంతువులు నుదుటిపై కుంకుమ పెట్టుకోరు.

మరింత సమాచారం తెలుసుకోండి: