పురాణాల ప్రకారం రాహువు పాముకి అధిపతిగా, కేతువును తోక భాగంగా చెప్పుకుంటారు. జాతకంలో కేతువు దుష్ప్రభావాల కారణంగా మనిషి మానసిక కుంగుబాటు, మతిస్థిమితం కోల్పోవడం, పడిపోవడం పెద్ద ప్రమాదాలకు గురవుతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కేతువు అశుభం. ఆ వ్యక్తి ఇబ్బందులు, వ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది. అయితే కేతువు ఎఫెక్ట్ పడొద్దు అంటే ఇలా చేయండి.

గుడికి నలుపు, తెలుపు దుప్పటిని దానం చేయండి
కేతువు బాధలు తొలగాలంటే రోజూ కేతువు ద్వాదశ నామస్మరణ చేయాలి
పాము ఆకారాన్ని వెండి ఉంగరంలో ధరించాలి
కేతువును ప్రసన్నం చేసుకోవడానికి, మెడలో వెల్లుల్లితో కూడిన కేతువు యంత్రాన్ని ధరించండి.
ప్రతినిత్యం గణపతిని పూజించి ఏడాది పాటు సంకట చతుర్థి వ్రతం పాటించండి. ఉపవాసం రోజున వినాయకుని మంత్రాలు
తర్వాత అథర్వశీర్షాన్ని జపించండి మరియు సామర్థ్యం మేరకు హవనాన్ని చేయండి.
కేతువు కష్టాలు తొలగిపోవడానికి, పనిలో వచ్చే అడ్డంకులు తొలగించడానికి ఆలయానికి వెళ్లి గణపతి, దుర్గాదేవికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి.
కేతువు ఇబ్బందులతో బాధపడుతుంటే, దాని చెడు ప్రభావాలను నివారించడానికి, నలుపు, తెలుపు నువ్వులను నీటిలో వేయండి.
ఆడపిల్లలకు నిమ్మకాయ, చింతపండు వంటి పుల్లని తిండి తినిపించండి.
నలుపు, తెలుపు కుక్క కు ఆహారంలో కొంత భాగాన్ని ఇవ్వండి లేదా కుక్కను ఇంట్లో పెంచండి.
కేతువు కు సంబంధించిన వస్తువుల ను దానం చేయడం మర్చిపోవద్దు. జాతకం లో కేతువు బలహీనంగా ఉంటే దానం చేయవద్దు. చేతనైనంత మేరకు డబ్బు, తిండి, బట్టలు ఇలా ఏదైనా సాయం చేయొచ్చు.
కేతువు ఎప్పుడూ బాధలకు మాత్రమే కారణం కానప్పటికీ అప్పుడప్పుడూ ఇబ్బందులు కూడా తప్పవు. మరోవైపు మోక్ష మార్గంలో నడవడానికి కూడా కేతువు  ప్రేరణ. అయితే మీ జాతకంలో కేతువు అశుభ ఫలితాల వల్ల ఇబ్బందులను కలిగిస్తే, దానిని అధిగమించడానికి సులభమైన, సమర్థవంతమైన మార్గాలు ఇవి. ఈ చిట్కాల వల్ల జీవితం పై కేతువు ఎఫెక్ట్ తగ్గిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: