మనం ఏదైనా హిందూ దేవాలయాల పక్క, హిందూ దేవాలయాలలే ఉండాలనుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పు పోయే దేవాలయం పక్కన ఏకంగా మసీద్ నే నిర్మించారట. అది కూడా నాలుగు వందల సంవత్సరాల క్రిందట అన్నట్లుగా సమాచారం. ఆ దేవాలయం ఎందుకు నిర్మించారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన సిరిసిల్ల అనే ప్రాంతం నుండి 10 కిలోమీటర్ల దూరం వెళితే అక్కడ ఒక రాజరాజేశ్వరి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. ఈ దేవుడిని దర్శించుకునేందుకు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం గల దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. పూర్వం చాళుక్యరాజులు ఈ దేవాలయం ఉన్న వేములవాడ ను రాజధానిగా చేసి 175 సంవత్సరాలు పాలించారట. ఇక అంతే కాకుండా అర్జునుడు కూడా ఒక మహాముని చంపడంతో అ పాపాన్ని తొలగించేందుకు ఇక్కడికి వచ్చారు అన్నట్లుగా కొంతమంది పండితులు తెలియజేశారు.

అర్జునుడి చేతిలో మరణించినటువంటి నరేంద్రుడికి ఆ ప్రాంగణంలో ఒక శివలింగం దొరికిందట. నరేంద్రుడు ఆ శివలింగాన్ని అక్కడే వదిలేశాడు, కానీ ఆ శివలింగాన్ని ప్రతిష్టించడం వల్ల అర్జునుడు చేసిన పాపము తొలగించినట్లు గా పురాణాలు చెబుతున్నాయి. అలా ప్రతిష్టించబడిన లింగమే మూలవిరాట్ అని చెబుతూ ఉంటారు. ఇక్కడే దేవాలయాన్ని దర్శించుకుంటే సంపూర్ణ పుణ్యఫలము లభించును.

శివరాత్రి పండుగను ఇక్కడ అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ఈ దేవాలయంలో వందమంది అర్చకులతో శివరాత్రి రోజున పూజలు నిర్వహిస్తారట. ఈ ఆలయ ప్రాంగణంలోనే నాలుగు వందల సంవత్సరాల కిందట కట్టినట్టు వంటి ఒక మసీదు ఉంది. ముస్లిం మతం అయినటువంటి ఒక భక్తుడు దేవుడిని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు అక్కడే మరణించడం జరిగిందట. ఆ వ్యక్తికి గుర్తుగా ఈ మసీదు నిర్మించారని అన్నట్లుగా అక్కడ ఉండేటువంటి కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. గుడిని జైన, బౌద్ధ శిల్పకళతో తయారు చేయబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: