2021 చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 4వ తేదీ శనివారం రాబోతోంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 03:07 వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. సూతకం ప్రారంభం నుండి గ్రహణం ముగిసే వరకు సమయం శుభప్రదం కాదు. అందుకే ఈ సమయంలో పూజలు చేయటం, తినటం, తాగడం నిషేధం. సూతకం సమయంలో ఆలయాలను మూసేస్తారు. సూతకం ప్రారంభమయ్యే ముందు కూడా తులసి ఆకులను ఆహారం, పానీయాలలో వేస్తారు. తులసి ఆకు ఏ వస్తువులో పడితే అది అపవిత్రమైనది కాదని నమ్ముతారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత మళ్లీ వాటిని సాధారణంగా ఉపయోగించవచ్చు. అయితే ఈసారి భారత్‌లో గ్రహణం కనిపించదు. దీని కారణంగా ఈ సూతక నియమాలు కూడా ఇక్కడ వర్తించవు. సూతకం అంటే ఏమిటి? తులసి ఆకులపై సూతకం ప్రభావం ఎందుకు ఉండదు?

సూతకం సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం రెండింటికి ముందు జరుగుతుంది. సూతకం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు రాహు కేతువులచే వేధింపులకు గురవుతారు. దీని కారణంగా వారు చాలా బలహీనంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో గ్రహణానికి కొన్ని గంటల ముందు ప్రకృతి చాలా సున్నితంగా మారుతుంది. వాతావరణంలో అనేక ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. ఇది అవాంఛనీయతకు కారణం కావచ్చు. దీనినే సూతక కాలం అంటారు. గ్రంధాలలో సూతకం నుండి గ్రహణం ముగిసే వరకు సమయం అశుభమైనది. అందువల్ల ఈ సమయంలో తినడం, త్రాగడం, పూజలు మొదలైనవి నిషేధం. అయితే, అనారోగ్యంతో ఉన్న వారికి, గర్భిణీలకు కొన్ని నిబంధనలలో మినహాయింపు ఉంటుంది.

ఆహార పదార్థాల్లో తులసి ఆకులను ఎందుకు వేస్తారు ?
శాస్త్రీయంగా గ్రహణం సమయంలో వాతావరణంలో ఉండే కిరణాలు ప్రతికూల ప్రభావాన్ని సృష్టిస్తాయి. అలాంటి సమయంలో ఆహారం లేదా పానీయాలు తెరిచి ఉంచినా లేదా ఈ సమయంలో ఏదైనా తిన్నా లేదా తాగినా ఈ కిరణాల ప్రతికూల ప్రభావం కూడా ఆ వస్తువులోకి చేరి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. తులసి ఆకులలో పాదరసం ఉంటుంది కాబట్టి, పాదరసంపై ఎలాంటి కిరణాల ప్రభావం ఉండదు. గ్రహణం సమయంలో ఆకాశ వృత్తం మరియు విశ్వం నుండి వచ్చే ప్రతికూల శక్తి తులసి దగ్గరికి వచ్చిన వెంటనే నిష్క్రియంగా మారుతుందని నమ్ముతారు. దీని కారణంగా తులసి ఆకులను ఏ వస్తువులలో వేసినా, ఆ వస్తువులు వాతావరణంలో ఉండే కిరణాల ప్రతికూల ప్రభావాల నుండి సేఫ్ గా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: