వివాహ పంచమి 2021 హిందువులకు ముఖ్యమైన రోజులలో ఒకటి. శ్రీ రాముడు, తల్లి సీత వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే రోజు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు మార్గ శిర, శుక్ల పక్షం లోని ఐదవ రోజున వస్తుంది. ఈ రోజున భక్తులు ఒకరోజు ఉపవాసం పాటిస్తారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీరాముడు, సీత తల్లి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఈ సంవత్సరం వివాహ పంచమి 8 డిసెంబర్ 2021 న జరుపుకుంటారు. అలాగే నమ్మకం ప్రకారం ఈ రోజున గోస్వామి తులసీ దాస్ రామ చరిత మానస్‌ ను పూర్తి చేశారు. ఇది రామాయణం అవధి వెర్షన్ (వాస్తవానికి వాల్మీకిచే స్వరపరచబడింది).

వివాహ పంచమి 2021 : తేదీ మరియు శుభ సమయం
తేదీ : డిసెంబర్ 8, బుధవారం
పంచమి తిథి ప్రారంభం - డిసెంబర్ 07, 2021 రాత్రి 11:40 గంటలకు
పంచమి తిథి ముగుస్తుంది - 08 డిసెంబర్ 2021 రాత్రి 09:25
వివాహ పంచమి 2021 : ప్రాముఖ్యత

హిందూ గ్రంధాల ప్రకారం సీత తండ్రి అయిన జనక మహా రాజు తన కుమార్తె కోసం స్వయంవరం ఏర్పాటు చేసాడు. అయితే అతను సీతను వివాహం చేసుకోవడానికి వచ్చిన రాజులు, రాకుమారులు అందరి ముందు శివుని పినాక విల్లును ఎత్త వలసి ఉంటుందని షరతు విధించాడు. దానిని ఎత్తిన వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తారు. రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా ఈ స్వయం వరంలో పాల్గొన్నారు. స్వయం వరం ప్రారంభమైన వెంటనే ఏ యువరాజు విల్లును ఎత్తలేకపోయారు. కాబట్టి గురు విశ్వామిత్రుడు శ్రీ రాముడిని విల్లును ఎత్తడానికి ప్రయత్నించమని కోరారు. రాముడు వెంటనే లేచి అప్రయత్నంగా విల్లు ఎత్తాడు. ఇది రాజు జనకుడిని ఆకట్టుకుంది. అతను తన కుమార్తెను రాముడికి ఇచ్చి సంతోషంగా వివాహం చేశారు.

వివాహ పంచమి 2021: పూజా ఆచారాలు
ఈ రోజున భారతదేశం, ముఖ్యంగా నేపాల్‌లో ఉన్న జనక్‌ పూర్‌లో భక్తులు గొప్ప పండుగను నిర్వహిస్తారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి సంతోషకరమైన, ప్రశాంతమైన వైవాహిక జీవితం కోసం ఆశీర్వాదాలు కోరుకుంటారు. శ్రీరాముడు, సీత మాత కూడా భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తారు. ప్రపంచం మొత్తం రాముడిని, సీతను ఆరాధిస్తుంది. నేడు చాలా చోట్ల రాముడు, సీత మాత ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వారి పెళ్లి రోజును ఘనంగా జరుపుకుంటారు. ఈ ముఖ్యమైన రోజున అయోధ్యతో సహా అనేక ప్రదేశాలలో పూజలు జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: