మనం ఏదైనా దేవాలయాలను సందర్శించేటప్పుడు.. అక్కడ ఉండేటువంటి కోనేరులో స్నానం చేయాలంటే ఎలా చేస్తామో మనం ఊహించుకోవచ్చు. అయితే స్నానం అనేది చాలా రకాలుగా ఉంటుందట.. స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అదే సమయం సందర్భాన్ని బట్టి చేసేటువంటి స్నాన పద్ధతులు మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రధానమైన స్నానం అభ్యంగన స్నానం.. ఈ స్నానాన్ని ఎప్పుడు చేయాలి..? ఎలా చేయాలో..? ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.స్నానం చేసేటప్పుడు చాలా పద్ధతిగా చేయాలట.. చేసేటువంటి వారి మనసు తడిచే విధంగా స్నానం చేయాలట.

1). మనం స్నానాన్ని ఎప్పుడూ తలపై నుంచి ప్రారంభించాలి.. ఒక వేళ వేడి నీళ్లతో స్నానం అయితే అది మన పాదాల నుంచి మొదలుపెట్టాలి. మగవారు తలస్నానం ప్రతిరోజు చేయడం చాలా మంచిదట. ముఖ్యంగా  పుట్టిన రోజున, ఏదైనా పండుగల రోజున.. అభ్యంగన స్నానం చేయడం చాలా మంచిదట.

2). అభ్యంగన స్నానం అనగా ఏమిటంటే.. మన శరీరానికి తైలాన్ని పూర్తిగా పట్టించి తలంటు పోసుకోవడం తప్పనిసరి.. ఇకపోతే నువ్వుల నూనెతో శరీరానికి బాగా మర్దన చేసి నలుగుపిండితో ఒళ్ళు రుద్దుకుని కొద్దిగా వేడి నీటితో తల స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అని అంటారు.. ఉగాది , సంక్రాంతి వంటి పండుగ రోజులలో నూనెలో మహాలక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఆవహించి ఉంటారు అని శాస్త్రం చెబుతోంది. అందుకే నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయడం వల్ల లక్ష్మీ గంగా దేవి అనుగ్రహం పొందగలుగుతారు.

3).అయితే తల స్నానం ఎప్పుడెప్పుడు చేయకూడదు అనే విషయానికి వస్తే పిండ ప్రదానం చేసే రోజున, ఆది మంగళ వారములలో పాడ్యమి.. చవితి..అష్టమి..నవమి.. చతుర్దశి.. తిథి ..రోజున అభ్యంగన స్నానం చేయకూడదు. అయితే తప్పని పరిస్థితులలో అభ్యంగనస్నానం చేయవలసి వస్తే అది కేవలం పండుగ, శుభ దినము లను మాత్రమే అభ్యంగన స్నానం చేయాలి.. ఇలా ఈ పర్వదినాలలో అభ్యంగన స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి దోషము కలుగదు అని పండితులు చెబుతున్నారు


కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అభ్యంగన స్నానం చేయదలిస్తే .. ఈ వారాలను చూసుకొని చేస్తే మరీ మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: