మూడు రోజులు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు తమ ఇంటికి పచ్చని తోరణాలతో అందంగా అలంకరించుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో ,బంధువులతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇక అంతే కాకుండా సంక్రాంతి రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మూడవరోజు చేసే కనుమ పండుగ గురించి కొన్ని తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కనుమ పండుగను ఎక్కువగా పశువుల పండుగ అని కూడా అంటారు. అవి ఆనందంగా ఉన్నట్లు అయితే రైతుకు కూడా ఆనందమేనట.. భారతీయ ధర్మం ప్రకారం ప్రతి ఒక్క రైతుకి ఇంటికి వచ్చే పంట ఎంతో గొప్ప సంస్కృతిగా ఆచరిస్తూ ఉంటారు. ఇక పంట పొలాల్లో పశువులను బాగా ఉపయోగిస్తూ ఉంటారు రైతన్నలు.. అందుచేతనే కనుమ పండుగ రోజున వాటిని బాగా శుభ్రంగా కడిగి, పూజ చేస్తూ ఉంటారు. ఇక పశువుల పట్ల కృతజ్ఞతతోనే ఇలాంటి పండుగ చేస్తూ ఉంటారు రైతులు. పశువులను అలా శుభ్రం చేసిన తరువాత వాటికి కుంకుమపెట్టి, కాళ్లకు మువ్వలు కట్టి.. అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత పూజ చేసి  టెంకాయ కొడుతూ ఉంటారు. ఇక అంతే కాకుండా వాటికి ఇష్టమైన ఆహారాన్ని కూడా ఆ రోజు పెడతారు.


 కనుమ రోజు బాగా ఎక్కువ మాంసం తింటూ ఉంటారు. ఆ రోజున ఎందుకు ప్రయాణం చేయకూడదని తెలుపుతారు అంటే.. కనుమ రోజున  చేసే వంటలు పెద్దలు ప్రసాదాలుగా భావించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆ రోజున పెద్దలు శుభకార్య దినంగా భావించడం వల్ల.. ఆరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధమని.. అందుచేతనే ఆ రోజు ప్రయాణం చేయవద్దని తెలియజేశారు కొంతమంది పెద్దలు. అంతేకాకుండా పితృదేవతలకి ఆ రోజున ప్రసాదం పెట్టి పూజించినట్లు అయితే అది విరుద్ధమని ప్రయాణాలు చేయవద్దని తెలుపుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: