మనం గుడిలో తీసుకునే కృష్ణ తులసి కలిపిన తీర్థంకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం కూడా అత్యంత శక్తివంతమైనది. దీంతో . సమస్త పీడలను విముక్తి చేస్తుంది. ఇంతకీ ఏం చేయాలని అని అనుకుంటున్నారా.. అదేంటంటే.. ప్రతి పౌర్ణమి రోజు ఉదయం పూట, ఇల్లు శుభ్రం చేసిన తరువాత, ఒక శుభ్రమైన పాత్రలో మంచి నీటితో నింపి దానిలో “కృష్ణ తులసి” ఆకులను వేసి పూజ చేసే ప్రాంతం దగ్గర నుండి మొదలుపెట్టి మీ ఇల్లంతా కృష్ణ తులసి కలిపిన తీర్థాన్ని చల్లాలి.

అంతేకాదు.. తీర్థాన్ని ఇల్లంతా చల్లిన తరువాత కుటుంబ సభ్యుల పైన కూడా చల్లుకుని, కొంచం నీటిని మాత్రం తీర్థంగా తీసుకోవాలి. ఇక ఇంటిలో ఉన్న ప్రతి గదిలో ఒక చిన్న మట్టి ముంతలో కృష్ణ తులసి ఆకులను వేసి ఉంచి తరువాత రోజు ఆ తులసి ఆకులను ఎవరూ నడవని శుభ్రమైన ప్రదేశంలో, కానీ ఒక చెట్టు మొదల్లో కానీ పడేయాలి. అయితే ప్రతి అమావాస్య రోజు సాయంత్రం పూట ఇంట్లోని అన్ని మూలల్లో తెల్లని పేపర్ వేసి రాళ్ల ఉప్పును దానిమీద పెట్టాలి. చివరికి బాత్ రూమ్స్ లో కూడా ఒక చిన్న గాజు కప్పులో రాళ్ల ఉప్పును పెడుతుండాలి.

అయితే మరసటి రోజు ఉదయం ఇల్లు ఊడ్చేటప్పుడు ముందుగా గదుల్లో ఉన్న ఉప్పును తీసి మురుగు కాలువలో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడేయాలి. అనంతరం నీటిలో రాళ్ళ ఉప్పును కలిపి ఆ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. అయితే ఈ రెండు రకాల కార్యక్రమాలను ప్రతి పౌర్ణమి, అమావాస్య తిధులలో చేసుకుంటే ఇంటికి పట్టిన సమస్త దోషాలు తొలగుతాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన అభివృద్ధికి అడ్డుఅనేది ఉండదని అంటున్నారు. అంతేకాదు.. ఈ కార్యక్రమాలను ఇంట్లో మాత్రమే కాదు ,వ్యాపార ప్రదేశాల్లో ఆఫీస్ లలో కూడా చేసుకోవచ్చునన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: