సాధారణంగా హిందూసంప్రదాయం ప్రకారం ప్రతి మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాముఖ్యత ఉన్న చెట్లలో తెల్ల జిల్లేడు చెట్టు గురించి ఒక్కసారి చూద్దాం. ఈ చెట్టు తెలుపు, లేత ఊదా రంగు పువ్వులతో ఉంటుంది. అయితే దీనిపై విఘ్నహర్త గణేశుడు స్వయంగా ఈ జిల్లెడు చెట్టులో కొలువై ఉంటాడని అందరూ నమ్ముతుంటారు. అంతేకాదు.. ఈ చేట్టు పూలు శివునికి చాలా ప్రీతికరమైనవి అని చెబుతున్నారు. ఇక ఈ మొక్కను ఇంట్లో శుభ ముహూర్తంలో పెడితే, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.

ప్రముఖ జ్యోతిష్కుడు డాక్టర్ అరవింద్ మిశ్రా ప్రకారం.. ఒక వ్యక్తికి అంతుచిక్కని వ్యాధి సోకినట్లయితే, ఈ జిల్లెడు చెట్టు అటువంటి వ్యాధిని గుర్తించి.. ఆ వ్యాధి తగ్గేందుకు సహాయపడుతుంది. ఇక ఆదివారం పుష్య నక్షత్రంలో ఆకు వేరును ఇంటికి తీసుకొచ్చి గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత  పచ్చిమిర్చి పూసి ధూపంవేసిన తరువాత  గణపతి 108 మంత్రాలను భక్తితో జపించాలని చెబుతున్నారు. చివరగా.. రోగి తలపై నుండి 7 సార్లు వేరును తిప్పి దానిని  సాయంత్రం నిర్మానుష్య ప్రదేశంలో దానిని పాతిపెట్టాలని చెబుతున్నారు. అలా చేసిన కొద్దిసేపటి తరువాత వ్యక్తికి సోకిన వ్యాధి/జబ్బు ఏంటనేది తేలుతుందని అంటున్నారు.

అలాగే ఈ చెట్టు పిల్లలకి ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు ముక్కను తమ నడుముకు కట్టుకోవాలని చెబుతున్నాడు. ఆ వేరును స్త్రీలు పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలని అంటున్నారు. అయితే ఇలా చేయడం వలన సంతానం కలుగుతుందని అందరు నమ్ముతుంటారు. అంతేకాదు.. రావిపుష్య యోగంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తెల్ల జిల్లేడు చెట్టును నాటాలని అంటున్నారు. అయితే ఈ మొక్క ఇంటిని చెడు దృష్టి, చేతబడి, తంత్ర-మంత్రాల దుష్ప్రభావాల నుండి కాపాడుతుందని జ్యోతిష్యులు చెప్పారు. అంతేకాదు.. తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టి, అదృష్టాన్ని తీసుకువచ్చే గణపతి శక్తనాశన స్త్రోత్రాన్ని పఠించడంతో అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: