వశీకరణ ప్రయోగాలపై మీకు భయం ఉందా..? ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన కలుగుతుందా..? అయితే ఈ చిన్న పరిహారం రోజు మీ ఇంట్లో చేస్తూ ఉండండి. దానివలన మీపై ఎలాంటి వశీకరణ ప్రయోగాలు పనిచేయవు. హనుమంతుడికి పూజ చేయడం వల్ల శుభం కలుగుతుంది. అందుకే చాలామంది మంగళవారం రోజు హనుమంతుడిని ఆరాధిస్తారు. హనుమంతుడు రాముని భక్తుడు. రామాయణంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అయితే మంగళవారం రోజు హనుమంతుడికి పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.

ఆంజనేయస్వామికి తరచూ ఆకుపూజ చేయిస్తూ ఉంటే సర్వత్రా జయం కలుగుతుంది. అంతేకాకుండా ఆయుష్షు, ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలు కూడా తీరుతాయని భక్తుల నమ్మకం. అలాగే నిద్రించేముందు, ప్రయాణానికి ముందు ఆంజనేయున్ని స్మరించిన వారికి మృత్యు భయం తొలగిపోతుంది. సంతానం లేనివారు మండలం రోజులపాటు హనుమంతుని చాలీసా పారాయణం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. హనుమంతుడి పూజ చేసేటప్పుడు అరటి పళ్ళు కానీ, మామిడి పళ్ళు కానీ నైవేద్యంగా పెడితే స్వామివారి అనుగ్రహం తప్పకుండ కలుగుతుంది.

 హనుమాన్ మందిరంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి మంచి ఫలితాలుంటాయి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరానికి బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. అలాగే హనుమంతున్ని పూజిస్తే గ్రహదోషంతో బాధపడేవారికి గ్రహశాంతి కూడా పొందొచ్చు. హనుమజ్జయంతి రోజే కాదు ప్రతి మంగళవారం, శనివారాలు కూడా హనుమంతుని పూజకు అనువైన రోజులు. ఎందుకంటే ఐశ్వర్య లబ్ధికి మంగళవారం, ఆరోగ్యసిద్ధి శనివారం. రోజు మీరు బయటికి వెళ్తున్నా లేదా ఇంట్లో నిద్రపోయే సమయంలోనైనా ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకొని పడుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీ పైన ఎలాంటి వశీకరణ చేసినా అది పనిచేయదు. ఆ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహం మీపైన ఉండి ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తారు. కాబట్టి ఆంజనేయ స్వామి ని పూజించడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని అర్థమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: