ప్రస్తుత కాలంలో మనం ఏ పని చేయాలన్నా, ఏ పని చేసినా మనం ఆశించేది మాత్రం ప్రధానంగా డబ్బే.. ఆ డబ్బే మనకు బ్రతుకు నిస్తుంది. ఈ డబ్బు చుట్టే ప్రపంచం కూడా తిరుగుతోంది. అలా మనం సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవడం లేదా..  అయితే ఇవి పాటిస్తే డబ్బు నిల్వ చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా..? డబ్బును చాలామంది  నిర్లక్ష్యం చేస్తారు. ఉదాహరణకు ఏదైనా హోటల్ కి వెళ్తే వారు ఇచ్చే టిప్పును విసిరేస్తారు. కొంతమంది డబ్బులు కాళ్లతో తన్నుతారు. అయితే డబ్బులు ఏముంది చిటికేస్తే వస్తుందంటూ హేళన  చేస్తుంటారు. డబ్బు అనేది లక్ష్మీదేవి కటాక్షం, మనం ఏ  విధంగా మలచుకుంటే ఆ విధంగా సంపాదన అనేది మన ఇంట్లో నిలుస్తుంది.

 డబ్బు కూడా దానికి విలువ ఇచ్చే వారి ఇంటికి మాత్రమే వెళ్తుంది. ఉదాహరణకు మనం ఎవరి ఇంటికైనా  వెళ్లాలంటే అవమానించే వారి ఇంటికి వెళ్ళం,  ఆదరించే వారి ఇంటికే  వెళ్తాం. డబ్బు కూడా అంతే.. ధనం ఇదం మూలం జగత్.. ఈ ప్రపంచమంతటికీ మూల కారణం ఏదైనా ఉందంటే అది డబ్బే. ముఖ్యంగా డబ్బును అవమానపరిచిన వారు అప్పులపాలు అవుతారు..  కొంతమంది ఆ విలువ తెలియక దాన్ని కాలరాసి, అవమాన పరచి అప్పుల పాలైన తర్వాత దాని విలువ తెలిసి వచ్చేలా చేస్తుంది. అలాగే డబ్బులు నిర్లక్ష్యం చేసిన వారికి అన్నం కూడా దొరకదు. ఆకలి విలువ కూడా తెలుస్తుంది. అలాగే విలువ లేకుండా కూడా పోతారు. ఎలా అంటే మీరు ఇంతకుముందు చాలా డబ్బు ఉండి అహంకారంతో బతికారు. డబ్బుంది కదా అని డబ్బు విలువ లేకుండా ఖర్చు చేశారు. డబ్బును చాలా చీప్ గా చేశారు. ఆ సమయంలో చాలామంది మీకు విలువ ఇచ్చారు. అదే డబ్బు మీ నిర్లక్ష్యం కారణంగా పోయిందంటే మీ విలువ కూడా  తగ్గుతుంది. డబ్బుకు కాలానికి విలువ ఇవ్వనివారు తొక్కి వేయబడతారు. అవమానాల పాలవుతారు. అంతే కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఛీ, తూ అని అవమానాలు ఎదుర్కొంటారు. మన సంపాదించిన సంపాదన ఉండాలంటే ముందుగా డబ్బును అవమానించడం, కాళ్లతో తన్నడం లాంటివి మానుకోవాలి. డబ్బుదేముంది చిటికలో సంపాదిస్తా.. నాకు డబ్బు ఒక లెక్క కాదు.

ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలా అన్న వారు డబ్బు లెక్కల నుంచి కూడా వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది. అందులో మనం చాలా స్పెషల్. వాటన్నిటినీ ఉపయోగించుకొని మంచి మార్గంలో డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో  స్త్రీ కళ్లల్లో నీళ్లు వచ్చేలా చేస్తే ధనం అనేది నిలవదు. ఎందుకంటే మనం ప్రకృతిని కానీ, స్త్రీని కానీ  అగౌరవపర్చితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ఆ ఇంట్లో ధన సమృద్ధి ఉండదు. తరతరాలు డబ్బుకోసం దేహి అనాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: