ఐపీఎల్ ప్రారంభానికి ముందునుంచి సీఎస్కే జట్టుకి వరుస షాకులు తగులుతున్నాయన్న విషయం తెలిసిందే.  అయినప్పటికీ ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో  దిగ్గజ జట్టు  అయిన ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి... చెన్నై బలం ఎక్కడా తగ్గలేదు అని నిరూపించుకున్న చెన్నై  జట్టు ఆ తర్వాత మ్యాచ్ ల్లో మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది. రాజస్థాన్ రాయల్స్ తో  రెండు మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోర  ఓటమిని చవిచూసింది. ఇక ఆ తర్వాత ధోనీ కెప్టెన్సీపై విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.




 అయితే ఒక మ్యాచ్ ఓడిపోతే ఏంటి మళ్లీ ధోని విజృంభిస్తాడు జట్టు  గెలుస్తుంది అని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక నిన్న ఢిల్లీ కాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తక్కువ అనుభవం ఉన్న కుర్ర ఆటగాళ్ల ముందు ఎంతో అనుభవం కలిగిన సిఎస్కె జట్టు రాణించలేకపోయింది. కుర్ర ఆటగాళ్ళ వ్యూహాల ముందు... సీఎస్కే ఆటగాళ్ల పప్పులు ఉడక లేదు. ఇక చివర్లో వచ్చిన ధోనీ మెరుపులు మెరిపిస్తాడని ఎంతో నమ్మకంతో ఉన్న అభిమానులకు ధోని ఆట కూడా నిరాశ కలిగించింది. మరోసారి ఘోర  ఓటమిని చవిచూసింది దిగ్గజ చెన్నై జట్టు.



 అయితే ఈ జట్టు ఓటమిపై కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో సాకు తెరమీదికి తెచ్చారు. జట్టులో అంబటి రాయుడు లేకపోవడం వల్లే తాము ఓటమిపాలు అవుతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్రసింగ్ ధోని. ఢిల్లీ క్యాపిటల్స్ తో  మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అదే అంటూ చెప్పుకొచ్చాడు. రాయుడు జట్టులో లేకపోవడం వల్ల జట్టు సమతూకం దెబ్బతింటుంది అని తెలిపిన ధోని... బ్యాటింగ్ ఆర్డర్ లో  సమతూకం లోపించి  దూకుడైన ప్రారంభ లేకపోవడంతో చివరికి రన్  రేటు పెరగడంతో పాటు ఆటగాళ్లపై ఒత్తిడి కూడా పెరుగుతుంది అంటూ తెలిపారు.  గాయం నుంచి కోలుకుని  రాయుడు జట్టులోకి వచ్చే పరిస్థితి మెరుగు  పడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: