ఐపీఎల్ హోరు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్  కూడా ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. చివరి బాల్ వరకు ఏ క్షణాన ఏం జరుగుతుందో మ్యాచ్ ఎటువైపు తిరుగుతుందో అన్నది కూడా ప్రేక్షకులకు అర్థం కాని విధంగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగి పోతున్నాయి  అన్ని మ్యాచులు. అయితే ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ జట్టుగా రంగంలోకి దిగి వరుస విజయాలను అందుకుని... పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగుతూ ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ధోనీ సారథ్యంలో చెన్నై జట్టు ఎంత విజయవంతంగా  ప్రస్థానాన్ని కొనసాగించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఎందుకొ ఈ  ఐపీఎల్ సీజన్ లో మాత్రం... చెన్నై జట్టు అంతగా సత్తా చాట లేకపోతుంది.



 దీనికి కారణం జట్టులో సమతూకం లోపించడమే అని గతంలో ఓడిపోయిన మ్యాచ్లో ధోని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు సీఎస్కే జట్టుకు ఐపీఎల్ ప్రారంభం నుంచి వరుసగా షాకుల తగులుతూనే ఉన్నాయి.. జట్టులోని ఆటగాళ్లకు కరోనా రావడం.. ఆ తర్వాత కీలక ఆటగాళ్లు జట్టు నుంచి నిష్క్రమించడం.. ఆ తర్వాత మంచి ఫామ్లో ఉన్నాడు అనుకున్న రాయుడు  గాయంతో జట్టుకు దూరమవడం ఇలా... వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. దీంతో ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లలో ... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పెద్దగా ప్రభావం చూపలేదు అనే చెప్పాలి. ఇక రెండు మ్యాచ్లలో ఘోర ఓటమి పాలు అయ్యింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.



 అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అందింది. ఇప్పటికే మునుపెన్నడూ లేనివిధంగా వరుస పరాజయాలతో... జట్టులో సమతూకం లోపించి సతమతమవుతున్న సిఎస్కె జట్టు లోకి మరో రెండు పదునైన ఆయుధాలు లాంటి ఆటగాళ్లు వచ్చేశారు. ఇప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్న అంబటి రాయుడు గాయం నుంచి కోలుకుని జట్టులోకి చేరాడు... ఇక మరో కీలక ఆటగాడు బ్రావో కూడా తుది జట్టులోకి చేరిపోయాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ కృషి అవుతున్నారు. ఇక ఇద్దరు  ఆటగాళ్లు జట్టులోకి రావడం తో తదుపరి మ్యాచ్ లో  సీఎస్కే సత్తా ఏంటో చూడవచ్చు అని ధీమాతో  అభిమానులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: