క్రికెట్ అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.బ్యాట్స్ మెన్ సెంచరీ సాధించినప్పుడు, బౌలర్ కీలక వికెట్స్ తీసినప్పుడు,ఫీల్డర్ అద్బుతమైన క్యాచ్ పట్టినప్పుడు, ఆటగాళ్లు ఎప్పుడు చెయ్యని విధంగా డ్యాన్స్ లతోనో,లేక తమ చేష్టలతోనో ప్రత్యేకత చూపిస్తూ అందరినీ అలరిస్తుంటారు. అలాంటి ఆసక్తికర సన్నివేశం ఐర్లాండ్-యుఏఈ జట్ల మద్య జరుగుతున్నా క్రికెట్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. 

యుఏఈ జట్టు బౌలర్ ఐర్లాండ్ జట్టులోని కీలక బ్యాట్స్ మెన్ వికెట్ తీసిన క్రమంలో నాగిని డ్యాన్స్ చేసి అందరినీ అలరించాడు.వివరాల్లోకి వెళితే..  షేక్‌ జాయేద్‌ స్టేడియం వేదికగా శుక్రవారం ఐర్లాండ్‌, యూఏఈ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తుంది.  క్రీజులో‌ బ్యాట్స్‌మన్‌ లోక్రాన్‌ టక్కర్ ఉన్నాడు. బౌలింగ్ లో యుఏఈ బౌలర్ ముస్తఫా 33 వ ఓవర్ వేస్తున్నాడు. ఈ క్రమంలో ముస్తఫా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై లోక్రాన్ టక్కర్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

 దీంతో ఆనందంతో ముస్తఫా కొన్ని సెకన్ల పాటు నాగిన్‌ స్టెప్స్‌ వేసి అలరించాడు. దీంతో అతని చర్యకు ఆశ్చర్యపోయిన తోటి క్రికెటర్లు.. 'నీలో ఈ కళ కూడా ఉందా' అంటూ ముస్తఫాను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియోనూ అబుదాబి క్రికెట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ముస్తఫా స్టెప్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: