ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో భాగంగా టీమిండియాతో వరుసగా సిరీస్ లూ  ఆడేందుకు సిద్దం అవుతుంది అనే  విషయం తెలిసిందే. ఇక ఇటీవలే భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టు తో టెస్ట్ సిరీస్ ఆడి  గణ విజయం సాధించి  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లోకి అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.  ఇక మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ జట్టుతో వరుసగా వన్డే టి20 సిరీస్ లూ  ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే జట్టు ఎంపిక పై అటు  బీసీసీఐ కసరత్తు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్  గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.




 ఇంగ్లాండ్తో జరగబోయే టి20 సిరీస్ కోసం రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్ లకు  తొలి ప్రాధాన్య ఓపెనర్లు అంటూ బిసిసిఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్  గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ దృశ్య శిఖర్ ధావన్ రిజర్వ్ ఓపెనర్ గా ఎంపిక చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంగ్లాండ్ తో  జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ నుంచి కూడా శిఖర్ ధావన్ ను  గాయాల బెడద వేధిస్తూనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తరచూ శిఖర్ ధావన్ గాయాల బారిన పడుతున్నాడు అంటూ గుర్తు చేసాడు దేవాంగ్ గాంధీ.



 గతంలో గాయం బారినపడిన శిఖర్ ధావన్ మోకాలు చికిత్స చేసుకుని మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసినప్పటికీ బ్యాటింగ్లో మునుపటి దూకుడు మాత్రం కనిపించడం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది చివర్లో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా శిఖర్ ధావన్ వేగంగా పరుగులు చేయలేకపోయాడని ఇక ఇటీవలే ముగిసిన విజయ్ హజారే వన్డే టోర్నీలో కూడా నామమాత్రపు పాత్ర పోషించాడు అంటూ చెప్పుకొచ్చాడు దేవాంగ్  గాంధీ. అటు కేఎల్ రాహుల్ మాత్రం ఏ స్థానంలో బ్యాటింగ్కు దింపినప్పటికి కూడా ఎంతో సక్సెస్ అవుతున్నాడని చెప్పుకొచ్చాడు.



 గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు అంటూ గుర్తు చేస్తాడు ఆయన. అందుకే మొదటి ప్రాధాన్యతగా రోహిత్ శర్మ కె.ఎల్.రాహుల్ ఓపెనర్లుగా పరిగణించాలని.. ఇక శిఖర్ ధావన్ ను రిజర్వుడు ఓపెనర్గా తీసుకోవాలి అంటూ సూచించారు. అదే సమయంలో గత ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ను  బీసీసీఐ ప్రోత్సహించాలని అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అంటూ సూచించారు.  కాగా ఇటీవలే బిసిసిఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: