ప్రస్తుతం సొంత గడ్డ పై భారత జట్టు ఇంగ్లాండ్ జట్టు తో వరసగా సిరీస్ లూ  ఆడేందుకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు తో టెస్టు సిరీస్ ఆడిన భారత జట్టు టెస్టు సిరీస్లో మొదట ఓడి పోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం అనూహ్యం గా పుంజుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అనే విషయం తెలిసిందే.  ఇకపోతే  రేపటి నుంచి ఇంగ్లాండ్తో తొలిటి టి 20  ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే టీమిండియా జట్టు  వివరాలను కూడా బీ సీ సీ ఐ ప్రకటించింది.



 అయితే బిసిసిఐ జట్టు వివరాలు  ప్రకటించినప్పటికీ కూడా క్రికెట్ ప్రేక్షకులు అందరి మదిలో కూడా ఒక ఆసక్తికర ప్రశ్న తలెత్తింది. ప్రస్తుతం బీసీసీఐ సెలెక్ట్ చేసిన జట్టు లో శిఖర్ ధావన్ కి కూడా అవకాశం దక్కిన  నేపథ్యం లో ఇక ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ గా ఎవరు రాబోతున్నారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమం లోనే రోహిత్ శర్మ కె.ఎల్.రాహుల్ ఓపెనర్ గా వస్తే బాగుంటుంది అని కొంతమంది లేదు కేఎల్ రాహుల్ కి బదులు శిఖర్ ధావన్ ఓపెనర్ వస్తే బాగుంటుందని మరి కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 కానీ భారత తుది జట్టు ఓపెనర్లు గా ఎవరిని రంగం లోకి దిగేందుకు  బిసిసిఐ సిద్ధమైంది అనే విషయాన్ని ఇటీవల విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ కే ఎల్ రాహుల్  టీమిండియాలో టి 20 సిరీస్లో ఓపెనర్ గా రాబోతున్నారు అంటూ చెప్పిన విరాట్ కోహ్లీ... ఇక ఆ తర్వాత శిఖర్ ధావన్ రాబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. శిఖర్ ధావన్ మూడవ స్థానంలో ఆడించేందుకు అది టీమిండియా నిర్ణయించింది అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: