ఐపీఎల్‌ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌  చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్లతో మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. అద్బుతమైన సురేశ్‌ రైనా 36 బంతుల్లో 54 పరుగులతో (3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, అనవసరపు రన్ కోసం పరిగెత్తే సమయంలో రన్ అవుట్ గా వెనుదిరిగాడు. మొయిన్‌ అలీ (24 బంతుల్లో 36 పరుగులు ( 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్యామ్‌ కరన్‌ 15 బంతుల్లో 34 పరుగులతో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించి భారీ స్కోర్ నోలకొల్పారు. ఇక వోక్స్, అవేశ్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. .

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ 54 బంతుల్లో 85 పరుగులు (10 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృథ్వీ షా 38 బంతుల్లో 72 పరుగులు (9 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీర విహారం చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని డక్ అవుట్ గా వెనుదిరగడం చెన్నై అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే ధోని ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు డకౌట్ గా నిలిచాడు.. 2010లో రెండు సార్లు, 2015లోనూ, ఇక తాజాగా 2021 ఒకటిలోనూ డకౌట్ గా వెనుదిరిగాడు. ఏది ఏమైనప్పటికి టైటిల్ వేటలో డిల్లీ బోణి కొట్టగా చెన్నై ఓటమితో సీజన్ ప్రారంభించింది. ఇక జరిగిన రెండు మ్యాచ్ లలో డీపెండింగ్ చాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో సీజన్ ను ఆరంభించడం గమనార్హం.  .

మరింత సమాచారం తెలుసుకోండి: