ఐపీఎల్ ప్రారంభం అయ్యింది అంటే చాలు అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అందుకే కేవలం భారత క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభమైంది.  ఇక మొదటి మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని చెప్పాలి.


 ప్రతి జట్టు కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తూ గెలుపు కోసం ఎంతగానో పోరాటం చేస్తూ ఉంటుంది. అయితే ఇక గేమ్ అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని అనుకోండి. అయితే ఐపీఎల్లో ఆటగాళ్లు మైదానంలో ఉన్న సమయంలో ఎంతో అగ్రసీవ్ ఉంటారు కానీ మైదానం వెలుపల మాత్రం ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు ఇక మైదానం వెలుపల ఆటగాళ్లు సరదాగా గడిపిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విడుదలై మారి పోతూ ఉంటాయి.



 ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ లోని కీలక ఆటగాళ్లు అయినా సురేష్ రైన అంబటి రాయుడు కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. వరుస విజయాల తో దూకుడు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్కు ఇక తర్వాత మ్యాచ్ కోసం కాస్త సమయం దొరకడం తో సరదాగా గడుపుతున్నారు.  రాయుడు సురేష్ రైనా లో తమ కుకింగ్ స్కిల్స్ చూంపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక చెఫ్ వంట చేస్తున్న సమయంలో వారి వద్దకు వెళ్లి మరి ఏకంగా సురేష్ రైనా అంబటి రాయుడు తమ కుకింగ్ స్కిల్స్ చూపించారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: