క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెటర్లు  ఏ చిన్న పని చేసినా కూడా అది క్షణాల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.  కేవలం క్రికెటర్లు మాత్రమే కాదు క్రికెట్ ఆటకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా సరే సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్ గురించి అయితే ఏదో ఒక వార్త హల్చల్ చేస్తోంది ఉంటుంది. ఇక ఇటీవల యువ సంచలనం పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్ గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది.  మైదానంలో ధనాధన్ బ్యాటింగ్ చేసే పృథ్వీ షా  ప్రస్తుతం ఓ యువతి ప్రేమలో మునిగి పోయాడు.



 ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్మెన్ ప్రస్తుతం ప్రాచీ సింగ్ అనే యువతితో ప్రేమాయణం నడుపుతున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడప్పుడు ఇక వీరిద్దరూ ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్లు పెడుతూనే ఉండటం కూడా దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఇటీవలే పృద్వి షా గర్ల్ ఫ్రెండ్ ప్రాచీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూస్తుంటే నెటిజన్లు అందరూ అవాక్కవుతున్నారు తన అద్భుతమైన బెల్లీ డాన్స్ తో అదరగొట్టింది ప్రాచి.



 తన లోని డాన్సింగ్ స్కిల్స్ అన్నింటినీ కూడా నెటిజన్లు అందరికీ కూడా పరిచయం చేస్తూ అద్భుతమైన హాట్ బెల్లి డాన్స్ చేసింది. ఇది చూసిన  నేటిజన్లు అందరి మతి పోతుంది అని చెప్పాలి. కరోనా విజృంభిస్తున్న వేల ఉపశమనం కలిగించడానికి బెల్లీ డాన్స్ ట్రై చేశాను ఎలా ఉందో చూసి చెప్పండి అంటూ క్యాప్షన్ కూడా జత చేసింది ఈ అమ్మడు. ఇది చూసిన నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు అనే చెప్పాలి. వీడియో చూసి సూపర్ అదిరిపోయింది అంటూ ఎన్నో కామెంట్లు కూడా పెడుతున్నారు. మరి దీనిపై పృథ్వీషా కామెంట్స్ చేస్తాడా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: