భారత జట్టు గత కొంత కాలం నుంచి టెస్ట్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా టెస్ట్ సిరీస్ లలో విజయం సాధిస్తూ చివరికి ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది  ఇక జూన్ నెలల్లో జరగబోయే ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ  క్రమం లోనే  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  షెడ్యూల్ కంటే ముందుగానే ఆటగాళ్ల ని కూడా ఇంగ్లాండ్ పంపించేందుకు బిసిసిఐ సిద్ధం అయింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇటీవల ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఇంగ్లాండ్ వెళ్లబోయే భారత క్రికెట్ జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇటీవలే బిసిసిఐ ప్రకటించిన టెస్ట్ క్రికెట్ జట్టులో అగ్రశ్రేణి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పై వేటు పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హార్దిక్ పాండ్యా తో పాటు ఓపెనర్ పృథ్వీ షా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కి కూడా చోటు దక్కలేదు. ముఖ్యంగా పవర్ హిట్టర్ గా పేరొందిన హార్దిక్ పాండ్యా పై వేటు వేయడంతో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కెప్టెన్ కోహ్లి సూచనల మేరకే హార్థిక్ పాండే పై వేటు పడినట్లు వార్తలు కూడా వస్తున్నాయి



 ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో టి20 వరల్డ్ కప్ జరగనుండగా ఇందులో హార్దిక్ పాండ్యా కి ఫినిషెర్ రోల్ ఇవ్వాలని ఉద్దేశంతోనే  హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్నెస్ తో   ఉండేందుకు విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టులో చోటు వద్దు అని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా మునుపటిలా కూడా బౌలింగ్లో బ్యాటింగ్ లో రాణించక పోవడం కూడా ఒక కారణం అన్న చర్చ జరుగుతుంది


 కాగా ఇటీవల బీసీసీఐ ప్రకటించిన టెస్టు జట్టు.. భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్

మరింత సమాచారం తెలుసుకోండి: