ప్రపంచంలో క్రికెట్ ఆటకు చాలా ప్రత్యేకత ఉంది. క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఫేవరెట్ ఆట. క్రికెట్ లో బ్యాటింగ్, బౌలింగ్, అల్ రౌండర్ విభాగాలలో స్పెషలిస్ట్ ఆటగాళ్లు ఉంటారు. టాప్ బ్యాట్స్ మెన్స్ బౌలింగ్ చెయ్యడం అరుదు. అలాగే టాప్ బౌలర్స్ బ్యాటింగ్ చెయ్యడం అరుదు. అయితే కొన్ని పరిస్థితుల్లో 11 మంది ఆటగాళ్లు అందరూ కూడా బౌలింగ్ వేసిన సందర్భాలు ఇప్పటి వరకు క్రికెట్ లో నాలుగు సార్లు చోటు చేసుకున్నాయి. ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం ..!  

మొదటి సారి జట్టు అంతా కూడా బాలింగ్ వేసిన సందర్భం 1884 సంవత్సరంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మద్య జరిగిన టెస్ట్ సిరీస్ లో చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 311 ఓవర్లు ఆడి 551 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి బిల్లీ మర్డోక్‌ 211 పరుగులు చేసి  ఏకంగా 490 నిమిషాలు క్రీజులో గడిపాడు. అతడికి తోడుగా పెర్సీ మెక్‌డానెల్‌ (103; 168 బంతుల్లో 14×4), టప్‌ స్కాట్‌ (102; 216 బంతుల్లో 15×4) శతకాలు బాదేశారు. మర్డోక్‌ వీరిద్దరితో కలిసి 143; 207 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో అప్పట్లో డిక్లరేషన్ లేని కారణంగా ఇంగ్లాండ్ 11మంది ఆటగాళ్లతో బౌలింగ్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ 346(f/o), 85/2 చేయడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

ఇక ఇలాంటి పరిణామమే 1980 పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మద్య టెస్ట్ సిరీస్ లో చోటు చేసుకుంది. ఈ సిరీస్ మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 211 ఓవర్లలో 617 పరుగులు చేసింది. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన పాక్ ను కట్టడి చేసేందుకు ఆసీస్ 11 మంది ప్లేయర్స్ తో బౌలింగ్ వేయించింది. ఇక ఏదే పరిస్థితి టీమిండియాకు కూడా తప్పలేదు. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2002 లో వెస్టిండీస్ పై జరిగిన టెస్ట్ సిరీస్ లో దాదా 11మంది తో బౌలింగ్ చేయించాల్సిన పరిస్థితి నెలకొంది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 196 ఓవర్లకు 513/9కి మూడో రోజు ఉదయం డిక్లేర్‌ చేసింది. అయితే వెస్టిండీస్ జట్టు ఆలౌట్‌ కాకపోవడంలో దాదాసేన ఐదో రోజు వరకు బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. మొత్తం 11 మంది కలిసి 248 ఓవర్లు విసిరారు. టీమ్‌ఇండియా స్పెషలిస్టు బౌలర్లు ప్రతి ఒక్కరు 45+ ఓవర్లు విసిరారు. . కరీబియన్‌ జట్టు ఐదో రోజు ఆఖర్లో 629/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. ఫలితంగా మ్యాచ్‌ డ్రా అయింది. ఇలా క్రికెట్ లో పలు సందర్భాలలో ఆటగాళ్లు అందరూ కూడా బౌలింగ్ చెయ్యాల్సిన పరిస్థితిలు అప్పట్లో ఏర్పడడం గమనార్హం.

 .

మరింత సమాచారం తెలుసుకోండి: