సంచలన నిర్ణయాలతో దేశంలోనే  గొప్ప సీఎంగా  పేరు తెచ్చుకుంటున్న  ముఖ్యమంత్రి స్టాలిన్. కోవిద్ 19 సమయంలో కరోనా నుండి ప్రజలకు  కాపాడేందుకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకొని కోవిద్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అలాగే ప్రభుత్వం రేషన్ షాప్ ద్వారా పలురకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో, ప్రతి పనిలో సమర్థవంతమైన పాలన చేస్తూ ప్రజలను ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొందుతాడు. అదేవిధంగా ఒలంపిక్స్ లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు గోల్డ్ మెడల్ సాధిస్తే 3 కోట్ల రూపాయలు బహుమానంగా అందజేస్తామని ప్రకటించారు.

 జపాన్ రాజధాని టోక్యోలో జూలై నెలలో టోక్యో వేదికగా  ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి.  ఒలంపిక్  క్రీడలు జులై  23న ప్రారంభమై ఆగస్టు ఎనిమిది ముగియనున్నాయి. ఈ క్రీడలలో భారత బృందం కూడా ప్రాతినిధ్యం వహించానుంది.  ఈ సందర్భంగా  భారతదేశం నుండి టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించిందని చెప్పవచ్చు. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించే క్రీడాకారులకు మూడు కోట్ల రూపాయల నజరానా ఇస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ బంపర్ ఆఫర్ ను ప్రకటించాడు. అలాగే రజిత విజేతలకు రెండు కోట్ల రూపాయలు, కాంస్య విజేతలకు  ఒక కోటి రూపాయలు నజరానాగా ఇస్తామని ఆయన  అన్నారు.

 తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయంతో భారత అథ్లెటిక్స్  క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం నెలకొన్నదని చెప్పవచ్చు. దీంతో క్రీడాకారులు అంతా సోషల్ మీడియా వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ కు అభినందనలతో ముంచెత్తుతున్నారు.  మీ నిర్ణయం మాకు ఇంకా బలాన్ని ఇచ్చిందని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి సంచలన నిర్ణయాలతో  పేదలకు, ఇటు క్రీడాకారులకు, ఏ రంగంలోనైనా వారిని ప్రోత్సహించి రాష్ట్ర ప్రజల అభివృద్ధి దిశగా వెళ్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ కు క్రీడాకారులు అంతా అభినందనలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: