ఇటీవలే బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విడదీసింది. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళింది. జూనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టు పొట్టి క్రికెట్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. శ్రీలంక వేదికగా జూలై 13 నుంచి మూడు వన్డేలు మూడు టి20 మ్యాచ్ లు ఆడనుంది టీమ్ ఇండియా జట్టు  మొదటిసారి టీమిండియా  కెప్టెన్గా ఎంపికయ్యాడు శిఖర్ ధావన్ . శిఖర్ ధావన్ కెప్టెన్సీలోనే టీమిండియాతో జట్టు శ్రీలంక పర్యటనలో ఎలా రాణించ బోతుంది అన్నది కూడా  ఆసక్తికరంగా మారింది


 ఇటీవలే ముంబైలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న యంగ్ టీమ్ ఇండియా జట్టు ఇటీవలే శ్రీలంకకు బయలుదేరింది. అయితే ఇటీవల శ్రీలంక లో అడుగుపెట్టిన భారత జట్టు కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా స్పెషల్ ఫ్లైట్ లో నేరుగా కొలంబో కి చేరుకుంది భారత జట్టు. సాధారణంగా అయితే ఇక టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సమయంలో ఇక ఆ దేశ క్రికెట్ బోర్డు జట్టు ఆటగాళ్లు అందరికీ ఘన స్వాగతం పలుకుతూ ఉంటుంది. కానీ ఇటీవలే టీమిండియా ఆటగాళ్లు కు ఎలాంటి స్వాగతాలు దక్కలేదు. 20 మందితో కూడిన భారత జట్టు కొలంబో చేరుకోగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి స్వాగతాలు ఏర్పాటు చేయలేదు శ్రీలంక క్రికెట్ బోర్డు.



 దీంతో శ్రీలంక చేరుకున్న యంగ్ టీమ్ ఇండియా జట్టు కాస్త ఆశ్చర్య పోయింది అని చెప్పాలి. శ్రీలంకలో అటు భారత జట్టుతో పాటు శ్రీలంక ఆటగాళ్లు కూడా బయో సెక్యూర్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంటూ మ్యాచ్లు ఆడనున్నారు. అయితే భారత ఆటగాళ్లకు సేవలందించే సిబ్బందిని కూడా ప్రత్యేకంగా సిరీస్ ముగిసేవరకు క్వారంటైన్ లో ఉంచనున్నారట. దీంతో శ్రీలంక వెళ్లిన భారత ఆటగాళ్లు కేవలం హోటల్ ఒకరికి మాత్రమే పరిమితం కానున్నారు. కాగా శ్రీలంక టూర్ కి బయలుదేరిన భారత జట్టు వివరాలు ఇలా ఉన్నాయి  : శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా

మరింత సమాచారం తెలుసుకోండి: